CBSE 10, 12వ తరగతి ఫలితాలు వచ్చాక, మార్కులు తక్కువ వచ్చాయి అని భావించే విద్యార్థుల కోసం బోర్డు కొన్ని అవకాశాలను కల్పిస్తుంది. దీనిపై ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ కొన్ని ముఖ్యమైన విషయాలను స్పష్టం చేశారు. మీరు రాసిన రాత పరీక్ష థియరీ పేపర్లకు మాత్రమే మార్కులను తిరిగి లెక్కించే లేదా రీవాల్యుయెషన్ కి అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్స్ లేదా ఇంటర్నల్ మార్కులను రీవాల్యుయెషన్ చేయడానికి వీలుండదు. ఎందుకంటే అవి స్కూల్ స్థాయిలోనే పూర్తవుతాయి కాబట్టి వాటిని మళ్ళీ తిరిగి లెక్కించేందుకు వీలుండదు.
రీవాల్యుయెషన్ కోసం అప్లయ్ చేసుచేసుకోవాలంటే:
మీకు మార్కులు తక్కువ వచ్చాయనిపిస్తే, మీ పేపర్‌లోని అన్ని సమాధానాలకు మార్కులు వేశారా ? టోటల్ మార్కులు వేయడంలో ఏమైనా తప్పులు ఉన్నాయా ? అని బోర్డు మళ్ళీ చెక్ చేస్తుంది. వెరిఫికేషన్ అయ్యాక కూడా మీకు నమ్మకం లేకపోతే, మీరు రాసిన జవాబు పేపర్స్ డిజిటల్ కాపీని (ఫోటోకాపీ) ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మీ పేపర్ ఎలా దిద్దారో మీరే స్వయంగా చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు.
రీ-వాల్యూయేషన్:
*మీరు రాసిన జవాబు కరెక్ట్ అయినా, దానికి తక్కువ మార్కులు ఇచ్చారని మీకు అనిపిస్తే.. ఆ ఒక్కో ప్రశ్నకి మళ్ళీ రికరెక్షన్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. దీనికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
*రీ-వాల్యూయేషన్ తర్వాత మీ మార్కులు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఒకవేళ మార్కులు తగ్గితే, అవే ఫైనల్ చేస్తారు. పాత మార్కులు చెల్లవు. కాబట్టి, మీకు ఖచ్చితంగా నమ్మకం ఉంటేనే దీనికి అప్లయ్ చేసుకోండి. దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.
*ఫలితాలు వచ్చిన వెంటనే బోర్డు ఇచ్చే గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగిశాక ఎటువంటి అభ్యర్థనలు తీసుకోరు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inను చూస్తుండాలి.
