ఢిల్లీ లిక్కర్ కేసులో కవితతో సహా అందరికీ క్లీన్ చిట్

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితతో సహా అందరికీ క్లీన్ చిట్

ఢిల్లీ లిక్కర్ కేసులో  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది.  రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరి పైన సిబిఐ నమోదు చేసిన కేసులను  కొట్టివేసింది ప్రత్యేక కోర్టు. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కేసులో నిందితులందరి పైన సిబిఐ దాఖలు చేసిన కేసును కొట్టివేసింది.

 కేసు నమోదు ,దర్యాప్తులో సిబిఐ అనుసరించిన విధానాన్ని ప్రత్యేక కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.  45 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన విచారణ  అనంతరం   తీర్పు వెల్లడించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి . విచారణ అనంతరం ఫిబ్రవరి 27న    తీర్పు వెల్లడించింది ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్.

2024 లో అరెస్ట్.

2024 మార్చి 15 సాయంత్రం ఈడీ కవితను అరెస్ట్ చేసి.. ఢిల్లీ తరలించింది. 153 రోజుల పాటు కస్టడీలో ఉంది. 2024 ఆగస్ట్ 27న  కవితకు  బెయిల్ వచ్చింది.  సీబీఐ, ఈడీ రెండూ కేసుల్లో కవితకు  బెయిల్ వచ్చింది.

కవిత ఈడీ కేసులో ఐదు నెలలు, సీబీఐ కేసులో నాలుగు నెలలు కస్టడీలో ఉన్నారు. రెండు కేసుల్లో మొత్తం 493 సాక్షులను విచారించింది.  కేసుకు సంబంధించి మొత్తం దాదాపు  50 వేల పేజీల డాక్యుమెంట్లు తయారు చేసింది.