రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూస్ తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన అషూ రెడ్డి (Ashu Reddy). టిక్ టాక్ కంటే ముందు వచ్చిన డబ్ స్మాష్ తో తెగ పాపులారిటీ సంపాదించుకున్న అషూ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ క్రేజీ గా మారింది.
లేటెస్ట్ గా అషూ రెడ్డి తన కారు సీరీస్ లో భాగంగా..కొత్తగా రేంజ్ రోవర్ కారును దాదాపుగా రూ.75 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఈ కారు తనకు నాలుగోవది. ఇప్పటికే తన గ్యారేజీ ఖాతాలో..మూడు కార్లు ఉన్నాయట. తన కెరీర్ స్టార్టింగ్ లో కొన్న స్కోడా కారుతో పాటు..తన తండ్రికి గిఫ్ట్ గా ఇచ్చిన బెంజ్ కారు. అషూ తనదైన వాక్ చాతుర్యంతో..మెస్మరైజ్ చేసే అందచందాలతో వరుస అవకాశాలతో రాణిస్తుంది.
ఇక రీసెంట్ గా కొన్న తన నెం.4 రేంజ్ రోవర్ కారుకి..సెలబ్రిటీల జాతకాలు చెప్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వేణు స్వామి(Venu Swami) తో పూజలు చేయించింది. ఇదే విషయాన్నీ వేణు స్వామి తన ఇన్స్టా లో షేర్ చేస్తూ..'మనల్ని అనుసరించే వాళ్లు మన సలహాలని పాటిస్తూ ముందుకు వెళ్లే వాళ్లని చూస్తే ఆ ఆనందం..అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- ALSO READ | హ్యాపీ బర్త్డే ఐష్.. తరగని అందంతో మాజీ మిస్
అషూ రెడ్డి ఓ వైపుగా సోషల్ మీడియాలో ఫేమస్ అవుతూనే..పలు టీవీ షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న దావత్ అనే షోకి అషూ రెడ్డి హోస్ట్ గా చేస్తూ..పలు హీరోస్ తో ఇంటర్వ్యూలో ముచ్చటించే తీరుకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా..అషూ రెడ్డిని జూనియర్ సమంత అని పిలుస్తుండటం విశేషం
