హ్యాపీ బర్త్డే ఐష్.. తరగని అందంతో మాజీ మిస్

హ్యాపీ బర్త్డే ఐష్.. తరగని అందంతో మాజీ మిస్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విశ్వసుందరి, నీలి కాళ్ళ సుందరి వంటి పేర్లతో ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan) సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. 1994వ సంవత్సరంలో మిస్ ఇండియాగా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన ఐష్..నేడు తన 50 వ బర్త్డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతుంది. దీంతో పలు సినిమా ఇండస్ట్రీల నుంచి బర్త్ డే విషెస్ అందుకుంటుంది ఈ బ్యూటీ. 

ఐశ్వర్య రాయ్..కెరీర్ స్టార్టింగ్ లో యాడ్ లలోనూ నటించి..ఇరువర్ అనే మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఐష్ హిందీ లోనే కాకుండా..తెలుగు, తమిళ, బెంగాలీ మళయాళం భాషల్లోను నటించి రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా మరెన్నో అవార్డులు సాధించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ లో స్థానం సంపాదించించుకున్న మొట్టమొదటి భారతీయ నటి ఐశ్వర్య కావడం విశేషం. 2003లో ఫిలిం ఫెస్టివల్ కు ఆమె జ్యూరీ మెంబర్ గాను పని చేశారు. అంతేకాకుండా..భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది. 

ఇక తన సినిమా కెరీర్లో జీన్స్, రోబో, దేవదాస్, చోఖెర్ బాలీ,  రైన్ కోట్ మూవీస్ తో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ కీ రోల్ లో నటించిగా..ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ మ్యారేజ్ చేసుకున్న ఐష్ కు ఆరాధ్య అనే కూతురు ఉంది.