సంగారెడ్డి జిల్లా: కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎగ్జిట్ వద్ద డివైడర్ మధ్యలో ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ సమీపంలో చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను అశోక్ లేలాండ్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అశోక్ లేలాండ్ వాహనం డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. చెట్లకు నీళ్లు పోస్తున్న మరో వ్యక్తి కూడా ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కొల్లూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
