బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ డైరెక్ట్ చేసిన మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి సందర్భంగా నవంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా విడుదల చేసిన ‘రంగులు రంగులే’ పాటతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. సీతారాముల కల్యాణ అద్భుత ఘట్టం సందర్భంలో వచ్చిన ఈ సాంగ్ వీడియో సొషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు తమదైన మ్యూజిక్ వైబ్‌తో శ్రోతలను అలరించగా.. తాజాగా వచ్చిన ‘రంగులు రంగులే’ కూడా వినసొంపైన స్వరాలతో ఆకట్టుకుంటోంది. మధురమైన బాణీ, హాయిగా సాగే సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో ‘రామాయణ’ మ్యూజికల్ జర్నీలో ఈ గీతం మరో అందమైన కానుకగా నిలుస్తోంది.
లెజెండరీ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ పాటను స్వరపరచడంతో పాటు సంగీతాన్ని అందించి, అరేంజ్ చేశారు. రాకేందు మౌళి సాహిత్యం అందించగా, రఘవ్ కౌశిక్, వైశాలి సామంత్ తమ గాత్రాలతో పాటకు మరింత మాధుర్యాన్ని జోడించారు. సంగీతం, సాహిత్యం, గాత్రాల సమ్మేళనం పాటను వినసొంపుగా తీర్చిదిద్దింది.
‘‘నువ్వే నా జీవంలో ప్రాణం అనురాగం...
అవనిజగా మారిన రూపం.. తను దీపం..
వైభోగమే వర్షించావు నా కోసం..
హృదయమ్ నీ ధామమ్.. ఈ జన్మ నీకంకితం...
నీతోడే ఉంటే రంగులు రంగులే.. మంగళ భరితమే..
ప్రేమనే రంగుల సౌధం..
ఆ రంగులు రంగులే మంగళ భరితమే..
జానకీ రాముల బంధం..’’ అంటూ సాగిన పదాలు సీతారాముల కల్యాణ ఘట్టాన్ని కళ్ళకు కడుతున్నాయి.
ఇప్పటికే ‘రామాయణ’ నుంచి వచ్చిన పాటలు క్రియేట్ చేసిన వైబ్‌ను కొనసాగిస్తూ, ‘రంగులు రంగులే’ కూడా శ్రోతలను అలరించేలా ఉంది. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఈ పౌరాణిక గాథపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీపావళి సందర్భంగా నవంబర్ 5న ‘రామాయణ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
