WI vs AUS 2025: రెండు రోజుల్లోనే 28 వికెట్లు.. రసవత్తరంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా టెస్ట్

WI vs AUS 2025: రెండు రోజుల్లోనే 28 వికెట్లు.. రసవత్తరంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా టెస్ట్

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం (జూన్ 25) ప్రారంభమైం తొలి టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి రెండు రోజుల్లో ఏకంగా 28 వికెట్లు నేలకూలడంతో మూడో రోజే ఆట ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. తొలి రోజు బౌలర్లు చెలరేగి 14 వికెట్లు తీయడంతో పాటు రెండో రోజు కూడా ఇరు జట్ల బౌలర్లు చెలరేగి మరి 14 వికెట్లు తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్ లో వెబ్ స్టర్ (19), ట్రావిస్ హెడ్ (13) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

మూడో రోజు ఆసీస్ మిగతా ఆరు వికెట్లను త్వరగా తీస్తే ఆస్ట్రేలియాపై ఆతిధ్య విండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. 4 వికెట్ల నష్టానికి 57 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 190 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 10 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో రోజు హోప్ (48) రాణించగా కెప్టెన్ ఛేజ్ 44 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లుయి తీసుకున్నాడు. హేజల్ వుడ్, కమ్మిన్స్, వెబ్ స్టర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. లియోన్ కు ఒక వికెట్ దక్కింది. 

►ALSO READ | ఇంగ్లండ్‌‌ జట్టులోకి ఆర్చర్‌.. నాలు‌గేళ్ల తర్వాత స్టార్ పేసర్ రీ ఎంట్రీ

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరోసారి బ్యాటింగ్ లో విఫలమైంది. విండీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేశారు. కొన్స్టాస్ (5), ఖవాజా (15), గ్రీన్ (15), జోష్ ఇంగ్లిస్ (12) తక్కువ స్కోర్ కే ఔటై నిరాశపరిచారు. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ ను వెబ్ స్టర్ (13), ట్రావిస్ హెడ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. వెస్టిండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్, షామర్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్, గ్రేవ్స్ తలో వికెట్ పడగొట్టారు.