పెద్ది డ్యాన్స్ ట్రై చేద్దామా.. ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘పెద్ది’ పోస్టర్లతో ఆసీస్ క్రికెటర్  రచ్చ రచ్చ!

పెద్ది డ్యాన్స్ ట్రై చేద్దామా.. ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘పెద్ది’ పోస్టర్లతో ఆసీస్ క్రికెటర్  రచ్చ రచ్చ!

Peddi Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగులు, సాంగ్స్‌కు రీల్స్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపిన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రీల్స్‌తో తెలుగు ఆడియన్స్‌కు విపరీతంగా దగ్గరైన వార్నర్.. ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాలో ఒక క్రేజీ క్యామియో (ప్రత్యేక పాత్ర) రోల్ ప్లే చేసి వెండితెరపై కూడా అలరించాడు. ఇక రీల్స్‌తో మొదలైన వార్నర్ టాలీవుడ్ ప్రయాణం.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోయే మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) కి అఫీషియల్ సపోర్ట్ ఇచ్చాడు. 

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘పెద్ది’ రచ్చ: 
రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషనల్ కంటెంట్, అఫీషియల్ పోస్టర్లను డేవిడ్ వార్నర్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు. ముఖ్యంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను పోస్ట్ చేస్తూ.. పెద్ది డ్యాన్స్ ట్రై చేద్దామా అని పోల్ పెట్టగా సుమారు 94 శాతం మంది Yes అని సమాధానం ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ వార్నర్ చేసిన పోస్టులను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

►ALSO READ | "రాకా" అల్లు అర్జున్ని RCB స్టార్ వెంకటేష్ అయ్యర్‌.. నెట్టింట ఫోటోలు వైరల్!

‘పెద్ది’ మూవీ హైలైట్స్:
'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారి చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండటం విశేషం. గతంలో ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలపై రీల్స్ చేసిన వార్నర్, ఇప్పుడు ‘పెద్ది’ సినిమాకు ఒక ప్రమోటర్ లాగా సపోర్ట్ ఇవ్వడం ఈ ప్రాజెక్టుకు గ్లోబల్ వైడ్‌గా మంచి బజ్ క్రియేట్ అవుతుంది.