SKN: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కు..బేబీ నిర్మాత రూ.10 లక్షల విరాళం

SKN: తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కు..బేబీ నిర్మాత రూ.10 లక్షల విరాళం

ప్రొడ్యూసర్ SKN..బేబీ మూవీ ఇచ్చిన సక్సెస్తో భారీ సినిమాలు నిర్మించకుండా..మంచి కాన్సెప్ట్తో చిన్న సినిమాలను నిర్మించడానికి రెడీ అయ్యారు. బేబీ తరహాలో సినిమాలు చేసుకుంటూ వెళాళ్లని డిసైడ్ అయి..తన నెక్స్ట్ సినిమాలు ప్రకటించి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా ఇటీవల వార్తల్లో  నిలిచారు. 

ఇక ఇప్పుడు మరోసారి ప్రొడ్యూసర్ SKN పేరు సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్(Telugu Film Directors Association) ఎన్నికలు నిన్న ఆదివారం జరిగిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో గుడుంబా శంకర్ దర్శకుడు వీర శంకర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్‌‌‌‌గా ‘బింబిసార’ ఫేమ్‌‌‌‌ వశిష్ట మల్లిడి, ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ భారీమెజార్టీతో విజయం సాధించారు. 

ప్రొడ్యూసర్ SKN ఎన్నికల విజయోత్సవ సభలో మాట్లాడుతూ..తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కోసం తనవంతుగా రూ.10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. తన స్నేహితులైన బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేశ్, వశిష్టకు మద్ధతుగా ఎస్ కేఎన్ ఈ భారీ విరాళాన్ని అందించారు.

తన స్నేహితుడు సాయి రాజేశ్ వైస్ ప్రెసిడెంట్గా..ఎన్నికల్లో  నిలబడినప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ వాగ్ధానానికి మద్ధతుగా రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రొడ్యూసర్ SKN అందించారు.ఇంతటి భారీ విరాళాన్ని సభ్యుల ఇన్సూరెన్స్ కోసం అందించినందుకు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.

ALSO READ :- పవర్ ఫుల్గా మారనున్న మార్కండేయ స్వామి వారి ఆలయం: బండి సంజయ్

అంతేకాదు..దర్శకుల సంఘంలో 1500 మంది యాక్టివ్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసిన సాయి రాజేశ్ కు మొత్తం 576 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు జరిగిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఒక పదవికి పోటీ చేసిన వ్యక్తికి..ఇంత భారీగా ఓట్లు రావడం అనేది ఇదే తొలిసారి కావడం విశేషం.బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ పేరిట ఇదొక ఎవర్ గ్రీన్ రికార్డ్గా నమోదైంది.