పవర్ ఫుల్గా మారనున్న మార్కండేయ స్వామి వారి ఆలయం: బండి సంజయ్

పవర్ ఫుల్గా మారనున్న మార్కండేయ స్వామి వారి ఆలయం: బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయం పవర్ ఫుల్ గా మారనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య శ్రీ రామ మందిరానికి ఎంతో మంది భక్తులు సహాయ సహకారాలు అందించారు.. అదేవిధంగా ఈ మార్కండేయ గుడికి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో  ఆలయ అర్చకులు, పద్మశాలి సంఘం నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. 

ALSO READ :- కాంగ్రెస్​లో చేరిన సిద్ధరాములు

సిరిసిల్ల పద్మశాలి నాయకుల ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ స్వామివారి ఉత్సవాలు, శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ నిర్మాణానికి భక్తులు అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. గుడి నిర్మాణానికి తనవంతు సహాయం అందిస్తానన్నారు ఎంపీ బండి సంజయ్.