Rithu Chowdary: ప్రేమించి మోసం చేశాడు.. మరో అమ్మాయితో వెళ్లిపోయాడు.. రీతూ చౌదరి ఎమోషనల్ పోస్ట్!

Rithu Chowdary: ప్రేమించి మోసం చేశాడు.. మరో అమ్మాయితో వెళ్లిపోయాడు.. రీతూ చౌదరి ఎమోషనల్ పోస్ట్!

బుల్లితెర నటిగా, బిగ్ బాస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి మరో సారి వార్తల్లో నిలిచారు. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిత్యం తన ఫోటోలతోనే అభిమానులను అలరించే రీతూ..  ఈ సారి తన వ్యక్తిగత జీవితంలోని జరిగిన సంఘటనను తెలుపుతూ ఆవేదనను వెళ్లగక్కింది.  ఒక అమ్మాయి ప్రేమలో విఫలమైతే ఈ సమాజం ఆమెను ఎంత హీనంగా చూస్తుందో వివరిస్తూ రాసుకోచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ప్రేమ, బ్రేకప్.. 

రీతూ చౌదరి కెరీర్ ప్రారంభం నుండి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గతంలో శ్రీకాంత్ అనే వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని బాహాటంగా ప్రకటించిన ఈ అమ్మడు. ఆ తర్వాత అనూహ్యంగా అతడికి దూరమైంది. లేటెస్ట్ గా ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్‌లో.. " ఎంతో నిజాయితీగా ప్రేమించాను, కేర్ తీసుకున్నాను. కానీ చివరకు మిగిలింది మోసం మాత్రమే" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తను ప్రేమించిన వ్యక్తి తనను వదిలేసి, మరో అమ్మాయితో చాలా ఈజీగా మూవ్ ఆన్ అయిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు ఒకప్పుడు తనకు స్నేహితురాలు అని పిలుచుకున్న వ్యక్తి అని చెప్పింది. కేవలం డబ్బు కోసం, అటెన్షన్ కోసం ఒక అమ్మాయి మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిందని రీతూ సంచలన ఆరోపణలు చేసింది.

సమాజం జడ్జిమెంట్ పై ఆవేదన

రీతూ చౌదరి తన పోస్ట్‌లో సమాజంపై ఘాటు విమర్శలు చేసింది. ఒక అమ్మాయి బ్రేకప్ వల్ల డిప్రెషన్‌లో ఉన్నా, కెరీర్ కోసం నవ్వుతూ కనిపిస్తే.. ఈ సమాజం ఆమె క్యారెక్టర్‌ను తప్పుగా జడ్జ్ చేస్తుందని మండిపడింది. నిజం తెలిసినా ఆ అమ్మాయి మౌనంగా ఉన్నందటే అది ఆమె బలహీనత కాదు, అంతా నా కర్మ అనుకుని దేవుడికి వదిలేస్తుందని అని పేర్కొంది.

అసలు ఆ వ్యక్తి ఎవరు?

బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక డీమాన్ పవన్‌తో రీతూ డేటింగ్ చేస్తోందన్న రూమర్లు గట్టిగా వినిపించాయి. వీరిద్దరూ కలిసి చేసిన రీల్స్, ఫోటోలు ఆ వార్తలకు బలాన్ని ఇచ్చాయి. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్‌లో "మరో అమ్మాయితో వెళ్లిపోయాడు" అని పేర్కొనడంతో, అది పవన్ గురించా? లేక పాత ప్రియుడు శ్రీకాంత్ గురించా? అన్న చర్చ మొదలైంది. ఈ పోస్ట్ తీరూ తన గురించే చేసిందా?  ఆ అమ్మాయి ఎవరనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

►ALSO READ | Viral Video : పాకిస్థాన్ గల్లీల్లో దద్దరిల్లుతున్న 'ధురంధర్ 2' క్రేజ్‌.. రణవీర్ సింగ్‌పై కుర్రాళ్ల ప్రశంసలు!

ప్రస్తుతం రీతూ చౌదరి టీవీ షోలతో బిజీగా ఉన్నప్పటికీ, లోలోపల ఇంతటి మానసిక సంఘర్షణ అనుభవిస్తోందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. "స్టే స్ట్రాంగ్ రీతూ" అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.  ఈ పోస్ట్ రీతూ తన గురించేనా ? ఆరా తీస్తున్నారు. మరి ఈ వివాదంపై ఆమె స్పష్టత ఇస్తుందో లేదో వేచి చూడాలి.