Viral Video : పాకిస్థాన్ గల్లీల్లో దద్దరిల్లుతున్న 'ధురంధర్ 2' క్రేజ్‌.. రణవీర్ సింగ్‌పై కుర్రాళ్ల ప్రశంసలు!

Viral Video : పాకిస్థాన్ గల్లీల్లో దద్దరిల్లుతున్న 'ధురంధర్ 2' క్రేజ్‌.. రణవీర్ సింగ్‌పై కుర్రాళ్ల ప్రశంసలు!

ఇప్పుడు ఎక్కడ చూసినా 'ధురంధర్' మానియానే .. ఇండియన్ బాక్సాఫీస్ వద్దనే కాదు.. మన పొరుగు దేశాల్లో  ఇదే. బాలీవుడ్ స్టార్ హీరో, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వస్తున్న  స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2: ద రివెంజ్స పైనే అందరి దృష్టి ఉంది. భారీ అంచనాలతో ఈ మూవీ మార్చి 19న  థియేటర్లలోకి రానుంది.  ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాక్ లో  'ధురంధర్ 2 మానియా!

భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఎన్ని ఉన్నా, బాలీవుడ్ సినిమాల పట్ల అక్కడి ప్రజల్లో ఉన్న అభిమానం మాత్రం తగ్గలేదు. పాకిస్థాన్‌లోని కరాచీ నగరం, అందునా ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్ రెహమాన్ దకైత్‌కు అడ్డాగా పేరుగాంచిన 'ల్యారీ' (Lyari) ప్రాంతం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.  అక్కడి కుర్రాళ్లలో కూడా ఈ మూవీ భారీ అంచనాలను పెంచేసుకున్నారు. ల్యారీ వీధుల్లోని అభిమానుల బృందం ఈ చిత్రంపై తమ స్పందనను తెలియజేశారు. 

రణవీర్ సింగ్‌ పై ప్రశంసలు..

సినిమాకు భాషా భేదాలు ఉండవు, కళకు సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపిస్తున్నారు.  ఈ క్లిప్‌లో కొందరు యువకులు రణవీర్ సింగ్‌ను "పవర్‌హౌస్ పెర్ఫార్మర్" అని అభివర్ణిస్తూ కేకలు వేస్తూ కనిపించారు. మరికొందరు డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను ఉద్దేశించి.. "ఈ సినిమా మొదటి భాగం కంటే మరింత భారీగా, విస్ఫోటనంలా (Explosive) ఉండాలి" అని సరదాగా సవాలు విసిరారు. రణవీర్ ఎనర్జీకి తాము ఫిదా అయ్యామని, ఈ సీక్వెల్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నామని వారు ఎంతో ఉత్సాహంగాచెప్పుకొచ్చారు.

సరిహద్దులు దాటిన అభిమానం

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో వైరల్ అవుతోంది. సినిమా అనేది ఇరు దేశాల మధ్య వారధిలా పనిచేస్తుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అధికారికంగా భారతీయ సినిమాల విడుదలపై పాకిస్థాన్‌లో ఆంక్షలు ఉన్నప్పటికీ, పైరసీ లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అక్కడి ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలను ఫాలో అవుతుండటం విశేషం. ముఖ్యంగా రణవీర్ సింగ్ మాస్ అప్పీల్, ఆదిత్య ధర్ టేకింగ్ పట్ల యువతలో ఉన్న క్రేజ్ ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

ధురంధర్ 2 ప్రత్యేకతలేంటి?

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక భారీ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు ఇందులో నటిస్తున్నారు.. భారత నిఘా వర్గాల నేపథ్యంలో సాగే ఈ కథలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని చిత్ర బృందం ఇప్పటికే హింట్ ఇచ్చింది. ల్యారీ వంటి ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి స్పందన రావడం సినిమా రేంజ్‌ను చెప్పకనే చెబుతోంది.