కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న విడుదలై మంచి వసూళ్లు సాధించింది. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.38.30 కోట్ల గ్రాస్, రూ.22.28 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.7 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్, రూ.27 కోట్లకు పైగా షేర్ సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌ను దాటి డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘చెన్నై లవ్ స్టోరీ’.. రూ.15 కోట్లకు పైగా లాభాలు అందించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. OTT, శాటిలైట్, మ్యూజిక్, డబ్బింగ్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరింత లాభం వచ్చినట్లు సమాచారం.
Thank you each and everyone for this love 😇🙏#ChennaiLoveStory pic.twitter.com/ybTmuXGvcY
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 1, 2026
‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఆగస్ట్ 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు, ఓటీటీ డీల్ ద్వారా నిర్మాతలు పెట్టిన పెట్టుబడిలో గణనీయమైన భాగాన్ని రికవరీ చేసినట్లు సమాచారం.
సాధారణంగా తెలుగు సినిమాలు థియేట్రికల్ రన్ అనంతరం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ ‘చెన్నై లవ్ స్టోరీ’ మాత్రం ఊహించని విధంగా సోనీ లివ్‌లో డిజిటల్ రిలీజ్ కానుండటం ఆసక్తిని కలిగిస్తోంది.
