గ్యాస్ పంపిణీ వ్యవస్థలో సరికొత్త అధ్యాయం.. ఇప్పటివరకు ఉన్న గ్యాస్ సిలిండర్ల కష్టాలకు చెక్.. ఇంతకుముందులా రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు.. జస్ట్ అలా వెళ్లి ఇలా గ్యాస్ సిలిండర్ పట్టుకురావడమే.. అవును మీరు విన్నది నిజం.. LPG గ్యాస్ పంపిణీ వ్యవస్థలో కీలక ముందడుగు పడింది. ఎల్పీజీ గ్యాస్ పంపిణీకి దేశంలోనే తొలిసారి LPG గ్యాస్ ATM లను అందుబాటులోకి తెచ్చారు. ఎల్పీజీ గ్యాస్ పంపిణీ సంస్థ BPCL పైలట్ ప్రాజెక్టుగా గురుగ్రాంలో LPG గ్యాస్ ATMను ఏర్పాటు చేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దం కారణంగా దేశంలో ఎల్ పీజీ గ్యాస్ కొరత ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో దేశ ప్రజలకు ఈ కొత్త సదుపాయం అందులోబాటులోకి వచ్చింది. ఈ ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం ద్వారా 24 గంటలకు గ్యాస్ సరఫరా చేస్తారు. గ్యాస్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పనిలేకుండా క్షణాల్లో రీఫిల్లింగ్ అవుతుంది.
ఈ గ్యాస్ వెండింగ్ మిషన్ పూర్తిగా ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. దానిని టచ్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లతో లాగిన్ అయి ఓటీపీ ద్వారా నిర్దారించుకోవాలి. ఆ తర్వాత యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మెషీన్ నుంచి ఫిల్డ్ సిలిండర్ బయటికి వస్తుంది. ఖాళీ సిలిండర్ ను స్టోర్ చేయాల్సి ఉంటుంది.
మెషీన్ లో తేలికైన సురక్షితమైన సిలిండర్..
ఈ ఎల్పీజీ గ్యాస్ ATM నుంచి లభించే సిలిండర్లు సంప్రదాయ ఇనుప సిలిండర్ల కంటే భిన్నంగా ఉంటాయి.ఇవి ఫైబర్‌తో తయారైన మిశ్రమ సిలిండర్లు. ఇవి తేలికైనవి, పరిశుభ్రమైనవి, తుప్పు పట్టనివి.సాంప్రదాయ సిలిండర్లు సుమారు 31 కిలోల బరువు ఉంటే, ఈ కొత్త సిలిండర్ సుమారు 15 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీనిని ఎత్తడం చాలా సులభం అవుతుంది.దీని నిర్మాణం గ్యాస్ ఎంతుందో పైకి కనిపిస్తుంది.
24 గంటల సర్వీస్.. త్వరిత రీఫిల్స్..
ఈ వెండింగ్ మెషీన్ తో అతిపెద్ద ప్రయోజనం 24 గంటలూ అందుబాటులో ఉండటమే.అంటే ఇకపై గ్యాస్ ఏజెన్సీ డెలివరీ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.మీరు ఎప్పుడైనా వెళ్లి కేవలం కొన్ని నిమిషాల్లోనే కొత్త సిలిండర్‌ను పొందవచ్చు.ఈ మెషీన్ ఒకేసారి 10 సిలిండర్లను నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే నిల్వ తక్కువగా ఉన్నప్పుడు గ్యాస్ ఏజెన్సీని ఆటోమేటిక్ గా అలెర్ట్ చేస్తుంది.
టెక్నాలజీ గ్యాస్ పంపిణీ వ్యవస్థను మార్చేసింది..
గ్యాస్ పంపిణీ వ్యవస్థలో తొలిసారి టెక్నాలజీతో సరఫరా మరింత ఈజీ అయింది. ఇది గ్యాస్ పంపిణీ వ్యవస్థలో కీలక ముందడుగు. BPCL కస్టమర్లు టెక్నాలజీ ద్వారా వేగంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా సేవలను అందించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నగరాల్లో త్వరలోనే LPG ATMలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
