బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, నటి సారా అలీఖాన్ కు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) షాక్ ఇచ్చింది. ఇకపై హిందూవేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూక కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన ధర్మంపై విశ్వాసం ప్రకటిస్తూ అఫిడవిట్ సమర్పిస్తే ఆలయ సముదాయాల్లోకి ప్రవేశం ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నటి, బీజేపీ ఎంపీ కంగానా రనౌత్ చేసిన వ్యాఖ్యలలు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సారా అలీ ఖాన్‌కు షరతు
ఈ ఏడాది నుంచి 47 దేవాలయాల్లోకి హిందువేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే, సారా అలీ ఖాన్ పర్యటనపై మీడియా అడిగిన ప్రశ్నకు BKTC చైర్మన్ హేమంత్ ద్వివేది ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సారా గతంలో అనేకసార్లు ఈ ఆలయాలను సందర్శించినప్పటికీ, ఇకపై ఆమె అక్కడ పూజలు చేయాలంటే నేను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాను, నాకు హిందుత్వపై విశ్వాసం ఉంది అని లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక ఫార్మాట్‌ను కూడా కమిటీ రూపొందించింది.
కంగనా రనౌత్ రియాక్షన్..
ఈ విషయంలో సారాకు మద్దతు ఇస్తూనే నిజాయితీగా ఉండాలని ఎంపీ కంగనా రనౌత్ సూచించారు. "ఇక్కడ ఉన్నవారంతా సనాతనులే. ఆమె (సారా) కూడా సనాతనే. అలాంటప్పుడు నిజాన్ని అఫిడవిట్ రూపంలో రాయడానికి భయం ఎందుకు?" అని కంగనా ప్రశ్నించారు. నిజం చెప్పడంలో ఎటువంటి సంకోచం ఉండకూడదని ఆమె నొక్కి చెప్పారు.
►ALSO READ | Dhurandhar2 RGV Review: 'ధురంధర్ 2' తో సౌత్ సినిమాల పని అవుట్.. రామ్ గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ!
చార్ ధామ్ యాత్ర ఎప్పటినుంచంటే?
సారా అలీ ఖాన్ తన మొదటి సినిమా 'కేదార్‌నాథ్' షూటింగ్ సమయంలోనే ఈ ప్రాంతంతో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె తండ్రి సైఫ్ అలీ ఖాన్ ముస్లిం కాగా, తల్లి అమృతా సింగ్ హిందూ. సారా తరచుగా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 19న అక్షయ తృతీయ నాడు ప్రారంభం కానుంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అదే రోజున తెరుచుకోగా, ఏప్రిల్ 22న కేదార్‌నాథ్, ఏప్రిల్ 23న బద్రీనాథ్ తలుపులు తెరుస్తారు.
ఈ నేపథ్యంలో BKTC తీసుకున్న ఈ అఫిడవిట్ నిబంధనపై తుది నిర్ణయం కోసం ప్రతిపాదనను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పంపారు. భద్రత, మతపరమైన ఆచారాల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది. సారా అలీ ఖాన్ నిజంగానే ఆ అఫిడవిట్ ఇచ్చి తన భక్తిని చాటుకుంటారా? లేదా ఈ వివాదం మరిన్ని మలుపులు తిరుగుతుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
#WATCH | " Sab sanatani hain...Yahan jo bhi hain sanatani hain...Wo bhi sanatani hai, so why fear in writing down the truth," says BJP MP Kangana Ranaut, on reports of Badrinath, Kedarnath Temple Committee Chairman asking actor Sara Ali Khan to submit an affidavit to offer… pic.twitter.com/Zz5V4bsnai
— ANI (@ANI) March 18, 2026
