బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న బుడ్డోడు.. 'బాలన్ ది బాయ్' ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న బుడ్డోడు.. 'బాలన్ ది బాయ్' ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

మలయాళం సినిమాలు అంటేనే సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలు, లవ్ స్టోరీస్ వంటి విభిన్న కాన్సెప్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆగ్ర హీరోలు నటించకపోయినా.. కేవలం కంటెంట్ తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటాయి. లేటెస్ట్ గా మాలీవుడ్ నుండి వచ్చిన ఎమోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్స్ 'బాలన్: ది బాయ్' (Balan: The Boy).  బాక్సాఫీస్ వద్ద ఈ బుడ్డోడు దూసుకుపోతున్నాడు.
 
బాక్సాఫీస్ వద్ద 'బాలన్ ది బాయ్'

డిఫెరెంట్ కాన్సెప్ట్ తో  థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి వీకెండ్ లో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకులు, సెలబ్రిటీల నుండి అదిరిపోయే ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్, మోలీవుడ్ కి చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం ఈ సినిమా నవల ఐడియాను, మేకింగ్ ను సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. అయితే, ఈ వీక్ డేస్ లో 'బాలన్' బాబు రచ్చ కాస్త తగ్గినా.. వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఐదో రోజు బాక్సాఫీస్ రిపోర్ట్

సమ్మర్ వీకెండ్ లో దుమ్ములేపిన ఈ సినిమా వర్కింగ్ డేస్ తగ్గినా వీకెండ్ లో మాత్రం మళ్లీ పెరిగింది. ప్రముఖ సినీ టెడ్ర్ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు  ప్రపంచ వ్యాప్తంగా రూ.24 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  సుమారు రూ.18 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రశంసలు అందుకుని మరింత హైప్ ను క్రియేట్ చేసింది. అటు థియేటర్లకు మాస్ ఆడియన్స్ మాత్రం నైట్ షోలకే ఎగబడుతున్నారు.

ALSO READ :  మనసు ముక్క‌లైంది.. మొన్ననే ఖుష్భు కుమార్తె పెళ్లిలో కలిసి నవ్వుకున్నాం

ఈ సినిమా ఫస్టాఫ్ లోని నవల ఐడియా, లేయర్డ్ స్టోరీ టెల్లింగ్, పర్ఫార్మెన్స్ లపై స్టార్స్ సైతం ఫిదా అయ్యారు. అయితే సెకండాఫ్, ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషన్స్ సరిగ్గా పండకపోవడం సినిమాకు మైనస్ గా మారింది. ఫర్జానా పలతింగల్ తన మిస్టరీ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించినప్పటికీ, స్క్రిప్ట్ లోని కొన్ని లోపాల వల్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిందనే టాక్ నడుస్తోంది. చందు సలీంకుమార్, గిరీష్ ఏ.డి, జీన్ పాల్ లాల్, గణపతి తదితరులు నటించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎంతవరకు నిలబడుతుందో చూడాలి..