ఎంత నిద్రపోయినా అలసటగా అనిపిస్తోందా? చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా,నడుస్తున్నప్పుడు తడబడుతున్నారా? ఇలాంటి లక్షణాలను చాలా మంది ఇవి వయసు పైబడటం వల్ల వచ్చే లక్షణాలని అనుకుంటారు. అయితే ఇవి వాస్తవానికి విటమిన్ బి12 లోపం కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ లక్షణాలు తీవ్రమయ్యే వరకు గుర్తించలేమని చెబుతున్నారు. శరీరానికి అవసరమైనపోషకాలలో బి12 ఒకటి..ఈ విటమిన్ తగినంత శరీరానికి అందకపోతే రోజువారి జీవతం చాలాకష్టంగా మారుతుంది. వయసై పోతుందని ఇలాంటివి కామన్ అని కొట్టిపారేయకుండా ముందస్తుగా గుర్తించి బి12 లోపాన్ని సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.
కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల తయారీకి, నరాలను రక్షించడానికి, శరీరం DNAను ఉత్పత్తికి ఈ విటమిన్ చాలా అవసరం. కానీ ముఖ్యంగా వృద్ధులలో, శాకాహారులలో,విటమిన్ ను సరిగ్గా గ్రహించలేని వారిలో దీని లోపం సర్వసాధారణమైపోయింది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, దీని లక్షణాలు నెమ్మదిగా మొదలవుతాయి..తీవ్రతరం అయ్యేవరకు గుర్తించడం కష్టం.చాలామంది సాధారణ వృద్ధాప్యంగా పొరపాటు పడుతుంటారు.
ది కన్వర్జేషన్ ప్రచురించిన హెల్త్ జర్నల్ ప్రకారం.. బి12 విటమిన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు కొందరిలో నిరంతరం అలసట, నీరసం, ఆయాసం ఉంటుంది. మరికొందరిలో చేతులు, కాళ్లలో జలదరింపు, జ్ణాపకశక్తి మందగించడం(బ్రెయిన్ ఫాగ్ ) వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన కణాలలోని చిన్న శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేయడానికి కూడా ఈ విటమిన్ సహాయపడుతుందా అనే దానిపై శాస్త్రవేత్తలు ఇప్పుడు పరిశోధిస్తున్నారు.
ALSO READ : జిమ్‌కి వెళ్లకుండానే కేవలం 30 రోజుల్లో సూపర్ ఫిట్
విటమిన్ బి12 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
- శరీరానికి ప్రతిరోజూ చాలా తక్కువ మోతాదులో విటమిన్ బి12 అవసరం.అయితే అది మంచి ఆరోగ్యానికి అత్యవసరం.
- ఇది సహజంగా మాంసం, చేపలు, గుడ్లు ,పాల ఉత్పత్తులలో లభిస్తుంది.
- అనారోగ్యంతో ఉన్నవారికి, శాకాహారులకు బలవర్ధకమైన ఆహారాలు లేదా సప్లిమెంట్లు అవసరం కావచ్చు.
- వయసు పెరిగే కొద్దీ శరీరం B12 ను తక్కువగా గ్రహిస్తుంది కాబట్టి, వృద్ధులకు ప్రమాదం ఎక్కువ.
