Dhurandhar2 RGV Review: 'ధురంధర్ 2' తో సౌత్ సినిమాల పని అవుట్.. రామ్ గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ!

Dhurandhar2 RGV Review: 'ధురంధర్ 2' తో  సౌత్ సినిమాల పని అవుట్.. రామ్ గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ!

సినీ ఇండస్ట్రీలో సంచనాలకు మారుపేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV). ఏదైనా విషయం నచ్చితే చాలు ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకపోతే పాతాళానికి తొక్కిపడేసేలా విమర్శలు కుప్పించడం ఆయన శైలి. లేటెస్ట్ గా ఆర్జీవీ చూపు 'ధురంధర్ 2' (Dhurandhar 2) పై పడింది. ఈమూవీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను చూసిన వర్మ, ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం అని అభివర్ణించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 'షోలే' కంటే 100 రెట్లు గొప్పగా

'ధురంధర్ 2' ప్రీవ్యూ చూసిన వర్మ తన ఎక్స్ (X) వేదికగా తన రివ్యూను పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రాత్రి ( మార్చి 17, 2026 ) 'ధురంధర్ 2' చూశాను. ఈ సినిమా చూపించే ఇంపాక్ట్, బాక్సాఫీస్ కలెక్షన్లు, ప్రేక్షకుల ఉత్సాహం చూస్తుంటే ఇది 'షోలే' కంటే 100 రెట్లు గొప్పగా ఉండబోతోంది. మొఘల్-ఏ-అజం నుంచి షోలే వరకు మనం చూసిన గొప్ప సినిమాలన్నీ ఈ చిత్రం ముందు కేవలం టీవీ సీరియల్స్ లా కనిపిస్తాయి అని రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా, హాలీవుడ్ దిగ్గజ దర్శకులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ కూడా తమ పనులన్నీ పక్కన పెట్టి మరీ ఈ సినిమాను 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చూడాలని సలహా ఇస్తూ ట్వీట్ చేశారు వర్మ.

బాక్సాఫీస్ వద్ద రూ. 2 వేల కోట్ల అంచనా!

ఈ సినిమా కేవలం బాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాది సినిమాల ఆధిపత్యాన్ని కూడా సవాల్ చేస్తుందని ఆర్జీవీ జోస్యం చెప్పారు. 'ధురంధర్ 2' గనుక రూ. 1500 నుంచి 2000 కోట్ల వసూళ్లు సాధిస్తే, ఇప్పుడున్న సౌత్ ఇండియన్ సినిమాల ట్రెండ్ మొత్తం తలకిందులవుతుంది. ఈ సినిమా బాహుబలి తరహాలో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అని పేర్కొన్నారు. దక్షిణాదిలో కూడా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తుండటం గమనార్హం అని కొనియాడారు.

 

కథాంశం.. 

రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్‌గా నటించిన ఈ చిత్రంలో 'జస్కీరత్ సింగ్ రంగీ' ఎలా 'హంజా అలీ మజారీ'గా మారి కరాచీలోని లియారీలో తన మిషన్ కొనసాగించాడనేది ప్రధానాంశం.  సంజయ్ దత్ (ఎస్పీ చౌదరి అస్లాం), ఆర్. మాధవన్ (అజయ్ సన్యాల్), అర్జున్ రాంపాల్ (మేజర్ ఇక్బాల్) వంటి  వంటి కీలక పాత్రలో నటించారు. వారి పాత్రలకు తగిన న్యాయం చేశారని ప్రశంసించారు.ఇటీవలే విడుదలైన 'ఆరి ఆరి' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  

ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న (రేపు) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  నేడు కొన్ని ప్రాంతాల్లో పెయిడ్ ప్రివ్యూలు కూడా ప్రదర్శిస్తున్నారు. నిజంగానే వర్మ చెప్పినట్టు 'ధురంధర్ 2' భారతీయ సినిమా గమనాన్ని మారుస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే!..