భారత జట్టులో వైభవ్ డెబ్యూకు బ్రేక్.. అసలు ముచ్చట చెప్పిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

భారత జట్టులో వైభవ్ డెబ్యూకు బ్రేక్.. అసలు ముచ్చట చెప్పిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

Vaibhav Sooryavanshi: ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం (International Debut) చేస్తాడని అందరూ ఎంతగానో వేచి చూసిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి మాత్రం తుది జట్టులో స్థానం దక్కకపోవడం ఫ్యాన్స్‌ని కాస్త నిరాశకు గురి చేసింది.

వైభవ్ కి తప్పకుండా ఛాన్స్ వస్తుంది: శ్రేయస్ 
భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. బెల్ఫాస్ట్ మైదానం వాతావరణం, కండిషన్స్ మాకు పూర్తిగా కొత్తవి.. అందుకే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే.. దురదృష్టవశాత్తూ అతను ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు.. మా టీంలో అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు.. ప్రస్తుతానికైతే గతంలో మంచి ప్రదర్శన చేసిన సీనియర్ ప్లేయర్ల వైపే మేము మొగ్గు చూపుతున్నాం.. ఖచ్చితంగా టైమ్ వచ్చినప్పుడు వైభవ్‌కు అవకాశం దక్కుతుందని వెల్లడించారు. 

భారత జట్టు లైనఫ్: 
పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ప్రస్తుత మ్యాచ్ కోసం భారత్ సెలక్ట్ చేసుకున్న కాంబినేషన్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఒక ఆల్‌రౌండర్,  మరో ఇద్దరు స్పిన్నర్లని తుది జట్టులోకి తీసుకున్నారు. కాగా ఈ సాలిడ్ బౌలింగ్ కాంబినేషన్‌తో ఐర్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని టీమిండియా ప్లాన్ చేస్తోంది. సిరీస్‌లో ముందడుగు వేయడానికి సీనియర్ల అనుభవం ప్లస్ అవుతుందని కెప్టెన్ అయ్యర్ నమ్ముతున్నాడు.