వెనుజులా విషాదం తర్వాత మరోసారి ప్రకృతి హెచ్చరిక.. ఫిలిప్పీన్స్లో 6.5 తీవ్రతతో భూకంపం

వెనుజులా విషాదం తర్వాత మరోసారి ప్రకృతి హెచ్చరిక.. ఫిలిప్పీన్స్లో 6.5 తీవ్రతతో భూకంపం

వెనుజులాలో భారీ భూకంపం గురించి ప్రపంచం మరువక ముందే.. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీయక ముందే.. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించడం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 2026 జూన్ 26 (శుక్రవారం) సాయంత్రం.. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో వచ్చిన భూకంపం.. ఫిలిప్పీన్స్ ను ఒక్కసారిగా షేక్ చేసింది. 

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం,  ఫిలిప్పీన్స్ ద్వీపమైన మిండానోలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.  29 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు పేర్కొంది. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. 

ఇటీవలే మిండానోలేని పలు ప్రాంతాల్లో వచ్చిన భూకంపం 80 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. అది జరిగిన కొద్ది వారాలకే మళ్లీ భూకంపం రావడం గమనార్హం. దీనికి తోడు.. బుధవారం (24 జూన్) సంభవించిన వెనుజులా భూకంపంలో.. 589 మంది చనిపోయారు. సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని చెబుతున్నారు. 2,980 మంది గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్  చెప్పారు. ఈ టైమ్ లో మరోసారి ఫిలిప్పీన్స్ లో ప్రకంపనలు రావడం ఆందోళన కరమైన విషయం. 

►ALSO READ | వెనెజువెలా కాదు.. చరిత్రలోనే అత్యంత భారీ భూకంపాలు ఇవే..!

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి, మిండానోలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమైన శక్తివంతమైన భూకంపం సంభవించిన కొద్ది వారాలకే ఈ తాజా భూకంపం సంభవించింది.

ఫిలిప్పీన్స్, పసిఫిక్ మహాసముద్రంలోని భూకంపాలు ఎక్కువగా సంభవించే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో ఉంది. దీంతో  ఆ దేశం తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలకు ఎక్కువగా గురవుతుంది.