ఫుట్ బాల్ గేమ్ సందర్భంగా ఒక ప్లేయర్ గోల్ కొడితే ఎంత సంబరం ఉంటుందే ఇటీవలే ఫిఫా వరల్డ్ కప్ చూసినోళ్లకు అర్థం అవుతుంది. వరల్డ్ కప్ అయినా.. చిన్న లీగ్ మ్యాచ్ అయినా అంతే కసితో ఆడుతుంటారు ఫుట్ బాల్ ప్లేయర్లు. గోల్ చేస్తే మ్యాచ్ గెలిచినంత ఆనందం పొందే ప్లేయర్ల సెలబ్రేషన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. అలాంటి సెలబ్రేషన్సే ఈ ప్లేయర్ పాలిట విషాదంగా మారాయి.
బ్రెజిల్ టాప్ ఫ్లైట్ ఫుట్ బాల్ కాంపిటిషన్ సందర్భంగా.. కొరిటిబా (Coritiba ) డిఫెండర్ జేసీ మరన్హవో గోల్ కొట్టిన ఆంనదంలో టన్నెల్ లో పడిపోవడం అందరినీ షాకింగ్ కు గురిచేసింది. పిచ్ కు పక్కనే ఉన్న టన్నెల్ లో పడిపోవడంతో మ్యాచ్ ఆందోళన కరంగా ముగిసింది.
బ్రెజిల్ సిరీ-A మ్యాచ్ లో భాగంగా కేప్ కోయెన్స్ టీమ్ పై కొరిటిబా 41వ నిమిషంలో కొట్టిన గోల్ తో 2-0 తేడాతో గెలుపు దిశగా దూసుకెళ్లింది. గోల్ కొట్టిన సంబరంలో బాల్ చేతబట్టిన ప్లేయర్ జీసీ.. తన సపోర్టర్స్ వైపు పరిగెత్తాడు. సెలబ్రేషన్స్ లో భాగంగా పిచ్ గోడను దూకడంతో పక్కనే ఉన్న సొరంగంలోకి పడిపోయాడు.
►ALSO READ | కొరియా మాస్టర్స్ క్వీన్ అష్మిత... చైనా షట్లర్ హాన్‌పై పోరాడి గెలిచిన భారత స్టార్
ఆ తర్వాత సెలబ్రేషన్స్ ఆపకుండా సొరంగం నుంచి బయటకు వచ్చి అదే రేంజ్ లో సెలబ్రేషన్స్ చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ కూడా ఆడాడు. అయితే యాంకిల్ (కాలి చీలమండ) విరిగిపోవడంతో మ్యాచ్ నుంచి సబ్ స్టిట్యూట్ చేశారు. జేసీ లేకపోయినా.. కొరిటిబా టీమ్.. కేప్ కొఎన్స్ పై 2-1 తేడాతో గెలిచింది.
పిచ్ పక్కన సొరంగం ఎందుకు..?
ఫుట్ బాల్ లో పిచ్ కు డ్రెస్సింగ్ రూమ్ ను కనెక్ట్ చేస్తూ టన్నెల్ ఉంటుంది. ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా టన్నెల్ ద్వారా పిచ్ కు చేరుకుంటారు. 2014 లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. క్యామెరూన్ స్ట్రైకర్ జోయెల్ కూడా అప్పట్లో బ్యారియెర్స్ పై నుంచి జంప్ చేయడంతో టన్నెల్ పడిపోయాడు. ఆ మ్యాచ్ లో కొరిటిబా సవో పావ్లో టీమ్ పై 3-1 తేడాతో గెలిచింది. ఇద్దరూ పడిన టన్నెల్ ఇదే కావడం గమనార్హం. అనూహ్యంగా జరిగినా.. ఇద్దరు ప్లేయర్లు ఒకే టన్నెల్ పడిపోవడం ఆశ్చర్యం. 2014 తర్వాత మరో 12 ఏళ్లకు అదే టన్నెల్ మరో ప్లేయర్ పడటం యాదృచ్చికంగా ఉందని బ్రెజిల్ జర్నలిస్ట్ లియోనార్డో మెండెస్ జూనియర్ అన్నారు.
🤯 FESTEJÓ EL GOL, CAYÓ EN LA FOSA, SE LESIONÓ, SIGUIÓ FESTEJANDO Y SE LO ANULARON
— Diario Olé (@DiarioOle) August 9, 2026
▶️ Jacy Maranhão festejó su gol anulado de CHAPECOENSE en la derrota 2-1 frente a los hinchas de CORITIBA que se asustaron con la caída pic.twitter.com/gcok6NZkLa
