ఒడిశా టూ మహారాష్ట్ర..మేడ్చల్‌లో భారీగా పట్టుబడ్డ గంజాయి

ఒడిశా టూ మహారాష్ట్ర..మేడ్చల్‌లో భారీగా పట్టుబడ్డ గంజాయి

మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్‌ఓటీ (SOT) పోలీసులు రట్టు చేశారు. మేడ్చల్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు... నిందితుల కదలికలపై నిఘా ఉంచి గంజాయి రవాణాను బట్టబయలు చేశారు.ఈ తనిఖీల్లో సుమారు 6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను మేడ్చల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితులను సచిన్ సంతోష్ జాదవ్, రాజేష్ మాధవ్ చౌదరిగా గుర్తించారు. ఈ కేసులో శంకర్ అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

►ALSO READ |  సనత్ నగర్  కల్ట్ ఫిట్ జిమ్‌లో కామాంధులు..మహిళా పైలట్ కు వేధింపులు..మేనేజర్, ట్రైనర్ అరెస్ట్

నిందితుల నుంచి గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ గంజాయి సరఫరా వెనుక ఉన్న అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌పై దర్యాప్తును ముమ్మరం చేశారు.