మీనరాశి:  పుష్కలంగా దైవానుగ్రహం..ఈ పరిహారాలు చేయండి .. ఆస్తి.. ఐశ్వర్యం మూడు రెట్లు పెరుగుతుంది..

మీనరాశి:  పుష్కలంగా దైవానుగ్రహం..ఈ పరిహారాలు చేయండి .. ఆస్తి.. ఐశ్వర్యం మూడు రెట్లు పెరుగుతుంది..

మీనరాశి:  పుష్కలంగా దైవానుగ్రహం..ఈ పరిహారాలు చేయండి .. ఆస్తి.. ఐశ్వర్యం మూడు రెట్లు పెరుగుతుంది..

ఆదాయం : 14
వ్యయం: 11
రాజపూజ్యం: 07
అవమానం: 02

పూర్వాభాద్ర 4వ పాదం
 ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు
 రేవతి, 1,2,3,4 పాదముల యందు పుట్టిన వారు
"ది.దు, శ్యం, ఝా, దా, దే, దో, చా, చీ అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మీనరాశికి చెందినవారు.


2026 - 2027 సంవత్సర ఫలితాలు: మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో శని, చతుర్థంలో గురువు, షష్ఠమంలో కేతువు. వ్యయంలో రాహువు ఉన్నారు. గురువు జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు ఆరవ స్థానంలో ఉంటారు. అంటే రోగస్థానంలో. కేతువుతో పాటు కలిసి ఉంటారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో పని చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం
ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి రాహువు లాభస్థానంలోకి, కేతువు పంచమంలోకి మారడం వలన విశేషమైన పేరుప్రఖ్యాతులు, ఆర్థికపురోగతి బాగుంటుంది...స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది.

మీన రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల ధనానికి లోటు ఉండదు. ఏదో రూపేణ ధనం సమకూరుతుంది.

జూన్ 2వ తేదీ తర్వాత మీనరాశి వారికి ఆర్థికపరమైన అంశాలు బలపడతాయి. వ్యాపార పురోగతి బాగుంటుంది. రాస్యాధిపతి దశమాధి పతియైన గురువు పంచమస్థానంలో ఉచ్ఛస్థితి పొంది ఉండడం వలస వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. నూతన పెట్టుబడులు పెడతారు. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది.

ALSO READ : కుంభరాశి :  గురు బలం అధికం.. అంత డబ్బు వస్తుందని ఊహించి ఉండరు..! 

ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలి నాటి శని నడుస్తుంది. అయినప్పటికీ గురుగ్రహ అనుకూలత వల్ల కొన్ని లాభాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసివస్తాయి.ప్రజాదరణ పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది.

వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన పరంగా ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.బంధువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కళా, సాహిత్యరంగాలలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది.

స్త్రీలకు ప్రత్యేకం : ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. పెళ్లి
అనేది చెప్పదగినది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల వల్ల రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాజకీయరంగంలో ఉన్నవారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు.

ముఖ్యమైన సభలకు, సమావేశాలకు ఆహ్వానం అందుకుంటారు. మీరు ఊహించని ఒక నూతన బాధ్యతను మీకు అప్పగిస్తారు. సినీకళారంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, డాక్యుమెంట్ రైటర్స్కి, చిరువ్యాపారస్తులకు, లెదర్ వ్యాపారస్తులకు, జూట్ బ్యాగ్ వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఐరన్, బ్రాస్, కాపర్ కనస్ట్రక్షన్​  ఫీల్డ్ లో  ఉన్నవారికి, కాస్మటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్. ఫార్మారంగంలోని వారికి, గోల్డ్పత్స్కి, బొటిక్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారస్తులకు, పూజాసామాగ్రి వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు ఫాస్ట్ ఫుడ్​ సెంటర్స్ కు ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.

ALSO READ : మకరరాశి :  స్థిరాస్తులు సమకూరుతాయి.. ఉన్నత ఉద్యోగం..నూతన గృహం..ఇంకా ఎన్నో శుభవార్తలు వింటారు

విద్యాపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత విద్య కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంది. స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్కార్టు, హెచ్ 1బి వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఆస్ట్రేలియా, యు.కె. జర్మనీ, ఈ దేశాలు వెళ్ళే వారికి, ఆరోగ్యపరంగా గ్యాస్టిక్, ఎసిడిటి, స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు. సైనిక్​ కు  సంబంధించిన విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి.

ధన వ్యయం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రూపాయి వస్తుంది కదా అని రెండు. రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించకపోతే, భవిష్యత్తులో ఇబ్బందిపడే అవకాశం లేకపోలేదు. చదువుపై శ్రద్ధ వహించకపోతే చదువు మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. చదువుకునే వయసులో చదువుని అశ్రద్ధ చేయడం సరికాదు. సంగీత, సాహిత్యాది, లలితకళల పట్ల ఆసక్తి కనబరుస్తారు.

ఉద్యోగ ప్రయత్నాలు  సఫలం అవుతాయి. అధికార స్థానాలలో వున్నవారు అత్యంత సన్నిహితం అవుతారు. స్వప్రయోజనాలు, అభివృద్ధి కొరకు పరపతి ఉపయోగపడుతుంది. ఆర్థిక వనరులను ఇబ్బందిలేని రంగాల్లో పెట్టుబడులు పెడతారు. శుభకార్యాలకు బంధువర్గం సహకారం కన్నా దైవమే ఎక్కువ మేలు చేస్తాడు.

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వలన అనుకున్న ఫలితాలని ఇస్తాయి. కళ, విద్యారంగాల్లో రాణిస్తారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవలసిన పరిస్థితి రావచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి.

ALSO READ : సింహరాశి : సమస్యలు అధిగమిస్తారు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం

సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. విదేశీయానం చేస్తారు. సంతానం. లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగం సాధిస్తారు.

కొన్ని కొన్ని విషయాలలో జీవితభాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న చోట సీటు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది.

బ్యూటీపార్లర్ వ్యాపారస్తులకు, కాస్మోటిక్స్, బ్యూటిషియన్, బొటిక్స్, వస్త్ర వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు, ఫాస్ట్​ ఫుడ్​  సెంటర్స్ కు ఆర్టిఫిషియల్ జ్యువెలరి రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి.

సంవత్సర ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీరికి అనుకూలంగా ఉంటుంది. హెచ్ 1బి, గ్రీన్కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్కార్డు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ పరమైన అవార్డులు అందుకోగలుగుతారు.ఐఏఎస్​., ఐపీఎస్​ వంటి వాటికి కష్టంమీద ఎంపికవుతారు. నిలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మనమీద ఈర్ష్యాద్వేషాలు ఉంటాయని అలాగే ధరించకుండా ఉంటారు.  ఆభరణాలను లాకర్లలో భద్రపరచండి. ఇంట్లో భద్రపరచడం అంత క్షేమం కాదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవలు సంప్రాప్తిస్తాయి.

ALSO READ : కర్కాటకరాశి : ఖర్చులు పెరిగినా డోంట్ వర్రీ.. గ్రహాలు బాగా అనుకూలిస్తాయి..

పరిహారాలు

  • ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం
  • రాహువుకి అధిష్టాన దేవత దుర్గా దేవి కాబట్టి చండీ హోమంచేయించుకోవడం 
  • ప్రతిరోజు ఓం నమశ్శివాయవత్తులతో దీపారాధన
  • మంగళ, శుక్రవారం రోజున అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించడం
  •  ఇంట్లోను, వ్యాపార ప్రదేశాలలోను గుగ్గిలంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన.
  • మొత్తం మీద ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి.  ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.