కర్కాటక రాశి
ఆదాయం : 02
వ్యయం: 11
రాజపూజ్యం: 04
అవమానం : 07
పునర్వసు 4వ పాదము
పుష్యమి 1, 2, 3, 4 పాదములు ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
"హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో" అనుఅక్షరములు తమ పేరునకు మొదట గలవారు కర్కాటకరాశికి చెందినవారు.
2026 - 2027 సంవత్సర ఫలితాలు: కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది.
ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు..డిసెంబర్ 5 నుండి కేతువు జన్మరాశిలో, సప్తమంలో రాహువు సంచరిస్తారు.
జూన్ 2 వరకు గురువు 12వ స్థానంలో ఉంటాడు. అంటే వ్యయ స్థానంలో ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయమని చెప్పవచ్చు. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తలు వహించాలి. గురువు జూన్ రెండవ తేదీ తర్వాత జన్మరాశిలోకి గురువు వస్తాడు.
షష్టమ భాగ్యాధిపతియైన గురువు జన్మరాశిలో ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూరప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు కలిసివస్తాయి.. మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలోకి వస్తారు. అప్పుడు ఆర్థికంగా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కొన్ని సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది. సంవత్సర ప్రథమార్థం అనుకూలంగా లేకపోయినప్పటికీ ద్వితీయార్థంలో మీరు అనుకున్న పనులను సాధించగలుగుతారు.
ఆధ్యాత్మికంగా దైవదర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పౌల్ట్రీ రంగం, శాస్త్రవేత్తలకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి అభివృద్ధి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి.
ఫైనాన్స్ సీములకు, బెట్టింగ్లకు దూరంగా ఉండటం మంచిది. రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్నేహితుల విషయంలో అందరిని నమ్మరాదు. శుభకార్యాలు చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నత పదవులు లభిస్తాయి.
కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగానే ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమైన ఫలితాలిస్తాయి. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ALSO READ : ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ధనప్రవాహం ఆగదు.. ఈ చిన్న పరిహారం చేయండి..!
గురువు ద్వితీయ స్థానంలో ఉండి ఏడవ స్థానాన్ని అంటే మీ వివాహ స్థానాన్ని చూస్తాడు కాబట్టి గురువు ఐదవ స్థానం పైన కూడా దృష్టి పెడతాడు కాబట్టి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. వ్యాపార పరంగా ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. దానిని జాగ్రత్తగా ఉపయోగించుకుని సేవింగ్స్ రూపంలో ముందుకు వెళ్ళడం మంచిది.
విదేశీయాన ప్రయత్నాలు ఆకస్మికంగా అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా కొన్ని రంగాలలో నిరాశ కలిగినా సంతానం అభివృద్ధి చెందడం, వాళ్ళ వలన పేరు ప్రఖ్యాతులు రావడం సంతోషం కలిగిస్తుంది. అదనపు బరువు బాధ్యతలు తప్పవు. రావలసిన బాకీలు ఎంతో శ్రమతో ఓర్పు వహించి కొద్ది కొద్దిగా జమ చేసుకుంటారు. చికాకులు ఎప్పుడు ఎలా. ఉత్పన్నమవుతాయో చెప్పలేనిస్థితి ఉంటుంది.
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. హెచ్ 1బి, పి.ఆర్, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు పోటీ పరీక్షలలో విజయం సాధించి, మంచి ఉద్యోగం సాధిస్తారు. ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష మెడలో ధరించాలి..
స్త్రీలకు ప్రత్యేకం : ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రథమార్థం కంటే ద్వితీయార్ధం చాలా బాగుంటుంది. జూన్ 2వ తేదీనుండి చాలా వరకు విజయాలు సాధిస్తారు. ఇబ్బందులు లేనటువంటి జీవనం సాగిస్తారు. తెలివిగా ఓర్పుగా కుటుంబ వృద్ధి సాధించుకుంటారు.
సమాజంలో గౌరవం పొందుతారు. సమయపాలన ద్వారా విజయాలు అందుకుంటారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది.
స్నేహితులతో కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీకున్న పలుకుబడితో నూతన కార్యక్రమాలు పూర్తి చేసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కళారంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా లేదు.
మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారికి అనుకూలమైన కాలం.
వైద్యవృత్తిలో ఉన్నవారికి, ఫ్యాషన్ డిజైన్ రంగంలోని వారికి, సాఫ్ట్ వేర్ రంగంలోని వారికి, ఫాస్ట్ ఫుడ్సెంటర్స్, బొటిక్స్ నడిపేవారికి, ట్రావెల్స్ సంస్థలో పనిచేస్తున్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మీ ప్రతిభతో పై అధికారులమెప్పు పొందగలుగుతారు.
ప్రభుత్వరంగంలో ఉన్నవారికి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పై అధికారుల అండదండలతో ముందకు సాగుతారు. స్త్రీ శక్తి ఏంటో నలుగురికి చూపించాలనుకుంటారు. దేనిలోను తక్కువకాదని పట్టుదలతో, కృషితో మీ వృత్తిరీత్యా పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. క్రీడారంగంలో ఉన్న వారికి అనుకూలమైనకాలంగా ఉందని పండితులు చెబుతున్నారు.
పరిహారాలు
శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ అరుణాచలేశ్వరుని దర్శనం సుకోవడం వలన మీరు అనుకున్నది సాధించగలుగుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
