మిథునరాశి
ఆదాయం: 08
వ్యయం :11
రాజపూజ్యం : 01
అవమానం :07
మృగశిర 3, 4 పాదములు
ఆరుద్ర 4 పాదములు
పునర్వసు 1, 2, 3 పాదములు యందు పుట్టినవారు
"కా,కి,కూ,ఖం,ఙ్ఞ, ఛ్చా, కే, కో, హా "అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మిథునరాశికి చెందినవారు.
2026 - 2027 సంవత్సర ఫలితాలు : మిధునరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. లగ్నంలో గురువు, తృతీయంలో కేతవు,నవమంలో రాహువు, దశమంలో శని అలాగే గురువు జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీవరకు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు.
ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు.కుటుంబ సంపద పెరుగుతుంది. ఆస్తి వివాదాలుమీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అప్పులు చాలావరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టబడులు పెడతారు. విలువైన ఆభరణాలు వస్తువులుకొనుగోలు చేస్తారు. వాక్ శుద్ధి పెరుగుతుంది.మీమాట తీరు మెరుగుపడుతుంది.
రాహువు 9వ స్థానంలో కేతువు మూడవ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచరించడం వలన మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతాయి. ఏ పనినైనాపట్టుదలతో సాధిస్తారు. దూరప్రాంత ప్రయాణాలు,తీర్థయాత్రలు, దైవదర్శనాలు ఎక్కువగా చేస్తారు.ప్రయాణాలు లాభదాయకంగామారతాయి.విదేశీ విద్య కోసం, విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి.
శని దశమ స్థానంలో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తిపరంగా పనిభారం అనేది పెరుగుతుంది. పై అధికారులు మీ కృషిని మీ సామర్థ్యాన్నిగుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ఆర్ధిక పరంగా బాగుంటుంది. గురువు జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలోకి ఎప్పుడైతే అడుగుపెడతారో వృత్తి వ్యాపారాల పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం చాలా బలంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది.. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.వాటిని సద్వినియోగ పరుచుకోవడమనేది చెప్పదగినది.
ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు, విదేశీయాన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యలో బాగా రాణించి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలం, అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి..
పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. స్వంత నిర్ణయాలు ఒక్కోసారి ఇబ్బంది పెడతాయి. సాఫ్ట్ వేర్, మెకానికల్, ఫార్మ, ఎయిర్ ఫోర్స్ ఈ రంగాలలోని ఉన్నవారు మంచి అభివృద్ధిలోకి వస్తారు.అనుకూలమైన గురు గ్రహ ప్రభావం వలన వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత మరియు నమ్మకం పెరుగుతాయి.
ఈ రాశివారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయా అంటే మాత్రం కొన్ని ప్రతికూలమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం పని భారం అనేది అధికంగా ఉంటుంది. వర్క్స్ లోడ్ అనేది విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి.
ALSO READ : వృషభరాశి : కొత్త పెడుబడులకు అవకాశం... ఆర్థికంగా బలపడతారు
శని కర్మ స్థానంలో ఉన్నప్పుడు వృత్తి పరంగా కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటారు. స్థిరాస్తులు ఏర్పర్చుకుంటారు. సంస్కృతి, సాంప్రదాయ సూత్రాలను ఇంట్లో ప్రవేశపెడతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొంతమంది విషయంలో నూతన పదవులు మరియు సన్మానాలు పొందుతారు.
నిరుద్యోగులకు మీ కృషితోపాటు అదృష్టం కూడా అవసరం. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.
జీవితం ఊహించని విధంగా సానుకూల మలుపులు తిరుగుతుంది. వృత్తిఉద్యోగాల్లో సంపాదన బాగా పెరుగు తుంది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, చలనచిత్రరంగంలోని వారికి క్రీడారంగాలలోని వారికి మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి.
వైద్య వృత్తిలో ఉన్నవారికి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలుగుతాయి. జి.ఎస్.టి వల్ల కొన్ని చికాకులు ఏర్పడుతాయి. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు లభిస్తాయి. సామాజికంగా జరిగే మార్పులు మీపై ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మార్పులు చూపిస్తాయి.
సహోదరులకు రహస్యంగా ధన సహాయం చేస్తారు. లోహపు వ్యాపారస్తులకు కాలం అనుకూలం. హోటల్ మేనేజ్మెంట్, నూతన వ్యాపారస్తులకు, చేతిపనిముట్ల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. భూములు కొనుగోలు, అమ్మకాలులో మీ ఓర్పు, సహనం వల్ల లాభపడతారు.
స్త్రీలకు ప్రత్యేకం : ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జూన్ 2న గురువు ద్వితీయంలోకి, మారడం వలన, భాగ్య స్థానాన్ని చూడడం వలన అదృష్టం కలిసి వస్తుంది.
ఉన్నత విద్య, దూర ప్రయాణాలు కలిసివస్తాయి. నలుగురిలోను పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి.. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరకంగా, మానసికంగా ఎక్కువగా కష్టపడటం వలన కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు.
చిన్న చిన్న వ్యాపారాలు లాభిస్తాయి. అతికష్టం మీద మీరు ఒక పనిని పూర్తి చేయగలుగుతారు. రాజకీయ అండదండలతో మీ స్థానాన్ని పదిలం చేసుకుంటారు. అనుకోని పదవి లభిస్తుంది. వివాహ
ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది.
పరిహారాలు
- ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రం పఠించడం
Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
