కుంభరాశి
ఆదాయం: 02
వ్యయం: 02
రాజపూజ్యం: 04
అవమానం: 02
ధనిష్ఠ 3,4 పాదములు
శతభిషం 1,2,3,4 పాదములు
పూర్వాభాద్ర 1,2,3 పాదముల యందు పుట్టినవారు
"గు, గే, గో, సా, సీ, సు, సీ. సో, దా" అను అక్షరములు తమపేరునకు మొదటగలవారు కుంభరాశికి చెందినవారు.
2026 - 2027 సంవత్సర ఫలితాలు: కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహువు, ద్వితీయంలో శని, పంచమంలో గురువు, సప్తమంలో కేతువు ఉన్నారు. గురువు మొదటి ఆరు నెలలు పంచమ స్థానంలో ఉంటాడు తరువాత జూన్ నెల రెండవ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు ఆరవ స్థానంలో ఉంటాడు.
అక్టోబర్ 31 నుండి జనవరి 24 వరకు ఏడవ స్థానంలో అంటే సప్తమ స్థానంలో గురువు ఉంటారు. అలాగే డిసెంబర్ 5 నుండి వ్యయంలో రాహువు, షష్ఠమంలో కేతువు సంచారం ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది.
జన్మరాశిలో రాహుగ్రహ సంచారం వల్ల వృత్తిఉద్యోగాలపరంగా స్థాన చలనం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఏర్పడుతాయి. ఇది అందరికీ కాదు.. కొంతమందికి మాత్రమే. కొంతమందికి ఏలినాటి శని యోగిస్తుంది. కొంతమంది ఏలినాటి శని యోగించదు. అది వారి జన్మ జాతకంపై ఆధారపడి ఉంటుంది.
సంవత్సర ప్రథమార్థంలో గురు గ్రహ అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన అభివృద్ధిని సాధించగలుగుతారు. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. గతంలో పెట్టబడులు పెట్టిన వాటి నుండి రాబడి రావడం మొదలవుతుంది.
ALSO READ : మకరరాశి : స్థిరాస్తులు సమకూరుతాయి.. ఉన్నత ఉద్యోగం..నూతన గృహం..ఇంకా ఎన్నో శుభవార్తలు వింటారు
సంవత్సర ద్వితీయార్థం అనగా జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు ఆరవ స్థానంలో అనగా రోగ స్థానంలో ఉంటారు దీని. వలన వృత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు ఏడవ ఇంటిలోకి మారుతారు. అంటే సప్తమస్థానంలో గురు కేతువులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉండటం వలన గణేశ యోగం అనేది ఏర్పడుతుంది.
ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా సహనం, ఓపిక, ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమ గురువు వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి.
భాగస్వామ్య వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. భాగస్వామ్యవ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాక, వృత్తిఉద్యోగాలపరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు, వృథా ఖర్చులు. ఉండే అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత మానసికంగా, శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. ప్రయాణాలలో చికాకు, ఉద్యోగంలో చికాకు అనేది ఏర్పడుతుంది.
ALSO READ : ధనస్సురాశి : కష్టాలు తీరుతాయి.. ఊహించని ధనలాభం.. గృహయోగం కలుగుతుంది.
ఉద్యోగపరంగా మీరు సాధించాలనుకునే స్థాయికి స్థానచలనం ఏర్పడుతుంది. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ కంటే పెద్ద స్థాయి కలిగిన వారిలో అంతరంగికచర్చలు ఫలిస్తాయి. ఇ.యన్.టి. సమస్యలు, లివర్ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, సైన్కి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ సమస్యలు రావచ్చు. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అప్పటి పరిచయాలు.. సర్టిఫికెట్లు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి.
మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ప్రాథమికంగా చిన్న కోర్టులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి..అయినప్పటికీ అంతు లేని ఆలోచనలతో మీ మనసు ఆందోళనకి గురి అవుతుంది.
ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గుట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికపరంగా, కుటుంబపరంగా పురోగతి బాగుంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విదేశాలకు వెళ్ళేవారికి అక్టోబర్ తర్వాతకాలం అనుకూలంగా ఉంది.
హెచ్ 1బి, గ్రీన్ కార్డ్, ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుండో ఉద్యోగం రాక విదేశాలలో ఉండి ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసివస్తాయి. శని వీరికి ద్వితీయంలో బలంగానే
ఉన్నారు. కుటుంబ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం అనేది ఉంటుంది.
డిసెంబర్ 6 నుండి వ్యయంలో రాహు, ఆరింట కేతుగ్రహ సంచారం వల్ల ఆరోగ్య పరమైన ఇబ్బందుల నుండి బయటపడ గలుగుతారు. విద్యా సంబంధమైన లోన్లు మంజూరు అవుతాయి.
దూరప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో మీ ఆశయం నెరవేరు తుంది. స్వార్థపరులుగా ఉండకుండా పదిమందికి సహాయం చేయాలనే ఆలోచనతో ఉండండి.
ALSO READ : కన్యారాశి: పేరు.. ప్రఖ్యాతులు పెరుగుతాయి.. కొత్త వ్యక్తుల పరిచయం.. అనుకోని ఫలితాలు సాధిస్తారు
పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, చెడు సావాసాలకు దూరంగా ఉండటం చెప్పదగినది. విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
స్త్రీలకు ప్రత్యేకం:ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. దూరప్రాంత విద్యావిషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక అంశాలు ఓ దారికి వస్తాయి. పొదుపు పథకాలకు ప్రాధాన్యత ఇస్తారు. భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభిస్తాయి. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది.
సంఘంలో మీ మాటలకు,చేతలకు విలువ పెరుగుతుంది. ఆ తర్వాత వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం అన్నివిధాలా మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి.
ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.టీ.వి. సినీ కళారంగాల
వారికి సానుకూలంగా ఉంటుంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి అత్యున్నతమైన పదవులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణులవుతారు.
ALSO READ : తులరాశి : అంచనాలకు మించి ఆదాయం.. పాశుపత హోమం.. అభివృద్దికి మార్గం..
సాఫ్ట్ వేర్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, వృత్తి వ్యాపార, ఉద్యోగం మరియు అన్నిరంగాలలో ముందంజలో ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల మినహా ఈ రాశి వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి.
పరిహారాలు:
- స్త్రీ పురుషులు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదవడం
- దుర్గాస్తోత్రం పఠించడం
- ప్రథమార్థంలో అఘోరపాశుపత హోమం
- ద్వితీయార్ధంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.
Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
