తులరాశి : అంచనాలకు మించి ఆదాయం.. పాశుపత హోమం.. అభివృద్దికి మార్గం..

తులరాశి : అంచనాలకు మించి ఆదాయం.. పాశుపత హోమం.. అభివృద్దికి మార్గం..

తులరాశి 

ఆదాయం : 05
వ్యయం : 14
రాజపూజ్యం: 06
అవమానం : 03

చిత్త 3,4 పాదములు
స్వాతి 1,2,3,4 పాదములు
విశాఖ 1,2,3 పాదముల యందు పుట్టినవారు
"రా.. రూ, రే, రో, త, తీ, తూ, తే"
అను అక్షరములు తమ పేరునకుమొదటగలవారు తులారాశికి చెందినవారు.

2026 - 2027 సంవత్సర ఫలితాలు : తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ
రాశివారికి పంచమంలో రాహువు, ఆరింట శని, తొమ్మిదింట గురువు.. ఏకాదశంలో కేతువు ఉన్నారు. ఈ గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. గురువు జూన్ రెండవ తేదీ వరకు భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత పదవ స్థానంలోకి అంటే కర్మ స్థానంలోకి వెళ్తాడు.

అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్లీ 11వ స్థానంలోకి వెళ్తాడు. ముఖ్యమైన గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే శని భగవానుడు ఎప్పుడైతే ఆరవ ఇంట్లో ఉన్నాడో ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు వచ్చినా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన అవి ఏవి కూడా మీ పై పని చేయవు. శని ఆరవ ఇంట్లో ఉండటంఅనేది అదృష్టంగా చెప్పవచ్చు. దీనిని శుభ శని అని కూడా పిలుస్తారు.

పాత రుణాలను తీర్చడానికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా ఆర్థికంగా అనుకూలతలు సూచిస్తు న్నాయి. వృత్తిపరంగా ఒత్తిడి అనేది ఉంటుంది.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

వృత్తి పరంగా గురువు జూన్ మాసం వరకు 9వ ఇంట్లో ఉంటాడు. శని ఆరవ ఇంట్లో ఉంటాడు. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ స్థిరమైన అభివృద్ధిని చూస్తారు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. జూన్ రెండవ తేదీన గురువు పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ స్థానంలో గురువు మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చినప్పటికీ పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు అధికంగా ఉంటాయి.

కేతువు 11వ ఇంటిలో ఉండటం వలన వ్యాపార పరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. జూన్ రెండవ తేదీ తర్వాత గురువు పదవ ఇంటిలోకి మారడం వలన వృత్తిపరంగా విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు కలిసివస్తాయి.

ఆర్థికంగా అంచనాలకు మించి పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఒక ముఖ్యమైన పని ఆలస్యంగా జరగడం వలన మానసికంగా ఇబ్బంది పడతారు.

ALSO READ : కన్యారాశి: పేరు.. ప్రఖ్యాతులు పెరుగుతాయి.. కొత్త వ్యక్తుల పరిచయం.. అనుకోని ఫలితాలు సాధిస్తారు

ప్రతి విషయంలో కూడా ముందు జాగ్రత్త చర్యలు. తీసుకోవడం చెప్పదగినది. విద్యార్థినీ విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు బాగుంటుంది. ముఖ్యంగా వైద్యవృత్తిలో ఉన్నవారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. విదేశీప్రయత్నాలు చేయవచ్చు.

మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. చదవు మీద శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. దుర్వ్యసనాలకు, సోషల్ మీడియాకు, స్నేహితులకు దూరంగా ఉండటం చెప్పదగినది. మీరు తీసుకునే స్వంత నిర్ణయాల వలన నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది.

అహంకార పూరితమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. పది మందిలో హూందాగా ఉండటం కోసం, విలాసవంతమైన జీవితం గడపటం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.ఏది ఏమైనా విద్యార్థినీవిద్యార్థులు తమ చదువు పట్ల అంకిత భావంతో ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది.

ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, సుబ్రహ్మణ్య పాశుపత రూపు మెడలో ధరించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి.

సేవా కార్యక్రమాల్లో, దైవకార్యాల్లో పాల్గొంటారు. మీరు చేసే దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో మీ ఆలోచనలకు, సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది.

ALSO READ : సింహరాశి : సమస్యలు అధిగమిస్తారు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం

ప్రభుత్వపరమైన ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి, హోల్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశివారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది.


స్త్రీలకు ప్రత్యేకం : ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నంచేస్తున్న వారికి గట్టి పోటీ ఉంటుంది. అయినా అందులో విజయం సాధిస్తారు.

విలాసవంతమైన జీవితం కొనసాగిస్తారు. వృత్తివ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది వ్యక్తులు మీతో భాగస్వామ్య వ్యాపారం చేయడానికి ముందుకు వస్తారు.ఎవరిని నమ్మకుండా మీరు స్వంతంగానే వ్యాపారం చేయండి. లాభాలు ఉంటాయి.

సినీకళా రంగాల వారికి, సాహిత్య రంగాలలో ఉన్నవారికి, చేనేత కార్మికులకు, బ్యూటీపార్లర్స్ నడిపేవారికి, ఈ సంవత్సరం ద్వితీయార్థంలోకలుసుబాటు తనంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. దైవదర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. రుణాలకు దూరంగా ఉండటం మంచిది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి విలువ పెరుగుతుంది.

ALSO READ : వృషభరాశి : కొత్త పెడుబడులకు అవకాశం... ఆర్థికంగా బలపడతారు

వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది.

పరిహారాలు

  • మంగళవారం హనుమాన్ వత్తులతోదీపారాధన చేయండి,
  • ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయండి.
  • సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం, హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.
  • మొత్తం మీద ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు.

Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి.  ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.