ధనస్సురాశి : కష్టాలు తీరుతాయి.. ఊహించని ధనలాభం.. గృహయోగం కలుగుతుంది.

ధనస్సురాశి : కష్టాలు తీరుతాయి.. ఊహించని ధనలాభం.. గృహయోగం కలుగుతుంది.

ధనస్సురాశి

ఆదాయం: 14
వ్యయం: 11
రాజపూజ్యం: 05
అవమానం: 06

మూల 1,2,3,4 పాదములు
పూర్వాషాఢ 1,2,3,4 పాదములు
ఉత్తరాషాఢ 1వ పాదముల యందు పుట్టినవారు
"యే, యో, బా, బి, భూ, భా, డ, భే"
అను అక్షరములుతమ పేరునకు మొదటగలవారు ధనుస్సురాశికి చెందినవారు.

2026 - 2027 సంవత్సర ఫలితాలు:  ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశివారికి తృతీయంలో రాహువు, చతుర్దంలో శని, సప్తమంలో గురువు, తొమ్మిదింట కేతువు. అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు అష్టమంలో, డిసెంబర్ 5వ తేదీ నుండి రాహువు ద్వితీయంలో, కేతువు అష్టమంలోకి మారుతారు. ఈ గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది.

ఈ రాశి వారికి అర్దాష్టమ శని నడుస్తోంది. అర్దాష్టమ శని ప్రభావం వలన మానసికమైన ఒత్తిడి, ఉద్యోగం ఒత్తిడి అధికంగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ పరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఈ రాశి వారికి ప్రథమార్ధం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది.

డిసెంబర్ 5 నుండి కేతువు అష్టమంలో ఉండటం వలన ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. పెద్దవారి ఆరోగ్యం విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

ALSO READ : వృశ్చిక రాశి: శుభ గ్రహాల సంచారం.. పట్టిందల్లా బంగారమే.. అదృష్టం తన్నుకొస్తుంది..!

రాహువు ద్వితీయ స్థానంలోకి మారడం వలన ఆర్థికంగా కలిసివస్తుంది. ప్రభుత్వపరంగా రావలసిన బెనిఫిట్స్ లభిస్తాయి. సేవింగ్స్​ కు ప్రాధాన్యత ఇవ్వండి. స్పెక్యులేషన్​ కి  దూరంగా ఉండటం, పొగిడే వాళ్లను దూరంగా ఉంచడం చెప్పదగినది. ఉద్యోగంలో మీపై దుష్ప్రచారం చేసే వారుంటారు జాగ్రత్త వహించండి. ఎవరు ఎన్ని చెప్పినా న్యాయబద్ధంగా నడుచుకోవాలి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అని భావిస్తారు.

గ్రీన్​ కార్డ్​  వీసాకోసం ప్రయత్నం చేసే వారికి వీసా లభిస్తుంది. దూరప్రాంత ప్రయాణాలు విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. వివాహాది శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతానం యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.

ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ఐఏఎస్​, ఐపీఎస్​, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ న్యాయవాదులకు, సాఫ్ట్​వేర్ ఇంజనీర్స్, రియల్ఎస్టేట్ రంగంలోని వారికి, ప్రథమార్థం బాగున్నప్పటికీ, ద్వితీయార్థంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

ఈ రాశివారు అఘోరపాశుపత హోమం, లక్ష్మీగణపతి హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. మెడలో ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన గ్రహదిష్టి, నరదిష్టి తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఏది ఏమైన మీకున్న ధైర్య సాహసాల వల్లనేబాగా రాణిస్తారు.

విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. హెచ్ 1బి వీసా లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైన ఉంటే తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో తల్లిదండ్రుల అండదండలు లభిస్తాయి. మీరు ఎంత కష్టపడితే ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి.. క్రమశిక్షణతో అడుగులు వేస్తారు.

ALSO READ : తులరాశి : అంచనాలకు మించి ఆదాయం.. పాశుపత హోమం.. అభివృద్దికి మార్గం..

డిసెంబర్ 5 తర్వాత రాహువు ద్వితీయ స్థానంలో ఉండడం వలన ధనప్రాప్తి, ఉద్యోగంలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. సేవింగ్స్​ కు  ప్రాధాన్యత ఇవ్వండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం, అవసరానికి మించి ఖర్చు చేయకపోవడం మంచిది.

స్త్రీలకు ప్రత్యేకం : ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి అధికారప్రాప్తి, కుటుంబంలోని బరువుబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

సంతానం పట్ల ఎక్కువగా ఆలోచించి, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రథమార్ధం చాలా వరకు బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు ఏర్పడుతాయి.వ్యాపార పరంగా అధిక ధనవ్యయ సూచన. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. అయితే మీరు ఒత్తిడిలోనే విజయాన్ని సాధించగలుగుతారు.

రియల్. ఎస్టేట్, సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంటెంట్స్, బొటిక్స్, సినీ కళారంగంలోని వారికి, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్మిని స్టేషన్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ధనం తక్కువగా సంపాదించినా పేరుప్రఖ్యాతలు బాగుంటాయి.

నరదిష్టి అధికంగా ఉంటుంది. అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రతి విషయానికి ఆందోళన చెందకుండా మీకున్న తెలివి తేటలతో అధిగమిస్తారు. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహరాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ALSO READ : కన్యారాశి: పేరు.. ప్రఖ్యాతులు పెరుగుతాయి.. కొత్త వ్యక్తుల పరిచయం.. అనుకోని ఫలితాలు సాధిస్తారు

సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. భూక్రయవిక్రయాలు లాభిస్తాయి. వాహనయోగం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. సంతాన సాఫల్య కేంద్రాల వల్ల మోసపోయే అవకాశం ఉంది.

పరిహారాలు :

  • సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం,
  • సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం
  • ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన
  • ఇంట్లోను, వ్యాపార ప్రదేశాలలోను గుగ్గిలంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన.

Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి.  ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.