వృశ్చికరాశి
ఆదాయం : 11
వ్యయం : 05
రాజపూజ్యం: 02
అవమానం : 06
విశాఖ 4వ పాదము
అనూరాధ 1,2,3,4 పాదములు,
జ్యేష్ఠ 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు
"తో, నా, నీ, నూ, నే, నో, ఎ.యా. యూ" అను అక్షరములు తమపేరునకు మొదటగలవారు వృశ్చికరాశికి చెందినవారు
2026 - 2027 సంవత్సర ఫలితాలు: వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది.. ఈ రాశివారికి చతుర్ధంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో గురువు, దశమంలో కేతువు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది. సంవత్సర ప్రథమార్ధంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున ఈ రాశి వారు ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో వాతావరణం చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు.
గురువు అష్టమ స్థానంలో ఉండటం మంచిది కాదు. ఆర్థికపరంగా అప్పులు చేయవలసి రావచ్చు. నూతన పెట్టుబడుల విషయాలలో కూడా ఈ రాశి వారు సంవత్సర ప్రథమార్ధం వరకు దూరంగా ఉండటం మంచిది. ఛాయాగ్రహమైన రాహువు మాతృ స్థానంలో ఉంటాడు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు అపార్థాలు వచ్చే అవకాశాలున్నాయి.
ALSO READ : తులరాశి : అంచనాలకు మించి ఆదాయం.. పాశుపత హోమం.. అభివృద్దికి మార్గం..
జూన్ రెండవ తేదీ తర్వాత ద్వితీయ పంచమాధిపతియైన గురువు భాగ్య స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణాలు చాలా వరకుతీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ పరంగా పదోన్నతి లభిస్తుంది. బదిలీలు కూడా ఉంటాయి. విదేశీ అవకాశాలు కలిసివస్తాయి.
సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, హోల్ సేల్ & రిటేల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సకాలంలో ప్రారంభించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్ధికలావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి.
ఆర్ధిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ
ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ మీద బరువు బాధ్యతలు పెరుగుతాయి.
డిసెంబర్ 5వ తేదీన రాహువు చతుర్థం నుండి తృతీయ స్థానంలోకి కేతువు దశమంనుండి భాగ్యస్థానంలోకి మారడం వలన చిన్నచిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసేప్రయత్నాలు కలిసివస్తాయి. ఎన్నడూ లేని విధంగా అదృష్టం మీకు తోడవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వృశ్చికరాశి వారు అదృష్టవంతులు.
ALSO READ : కన్యారాశి: పేరు.. ప్రఖ్యాతులు పెరుగుతాయి.. కొత్త వ్యక్తుల పరిచయం.. అనుకోని ఫలితాలు సాధిస్తారు
గురుగ్రహ అనుగ్రహంతో అన్నింటిలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. రాజకీయ పరమైనటువంటి చిక్కులు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. స్థిర చరాస్తుల విలువ పెరుగుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
థైరాయిడ్, బి.పి., షుగర్, ఇండైజిషన్, ఉదర సంబంధిత సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోతం పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి.విద్యా పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలిసివస్తాయి. ద్వితీయార్థంలో వీసాకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగంకోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సివిల్ సర్వీస్లకు ఎంపిక అవుతారు. ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. పదిమందిలో మెచ్చుకోలుగా ఉంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి.
వైద్య విద్యను అభ్యసిస్తున్నవారు, సాఫ్ట్ వేర్, మెకానికల్, కళాసాంస్కృతిక రంగంలో ఉన్నవారికి,
బ్యూటీపార్లర్స్, కాస్మోటిక్స్, ఇ.ఎన్.టి, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ మొదలైన రంగాలలో ఉన్న వారు మంచి అభివృద్ధి సాధిస్తారు. ప్రథమార్థంలో మరియు ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం, అలాగే రాహుకేతువులకు జప, దాన, తర్పణాలు చేయించడం అనేది చెప్పదగిన సూచన.
ALSO READ : జ్యోతిష్యం : మేషరాశి వారి కోరికలు నెరవేరే సమయం వచ్చేసింది.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి..!
స్త్రీలకు ప్రత్యేకం : ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎన్నో విషయాలు కలిసివస్తాయి. పాడి పరిశ్రమలో లాభాలు బాగుంటాయి. విద్యా సాంస్కృతిక విషయాలలో మార్పులు వస్తాయి. మీ వ్యక్తిగత సమస్యలు. పరిష్కారం కావడంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు అనుకోకుండా నెరవేరడం జరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం పెరుగుతుంది. శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాలపరంగా బరువుబాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి.
కొన్ని విషయాలలో మీ శ్రమకి తగిన ఫలితం లభించదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బాగానే ఉంటాయి. నిర్మాణ రంగంలో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు. లభిస్తాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, నీటికి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి, ఐ.వి.ఎఫ్ కోసం వెళ్ళేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కుటుంబబాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు.
ఆర్భాటాలకు, పొగడ్తలకు దూరంగా ఉండటం చెప్పదగినది. దూరప్రయాణాలు కలిసివస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్ధాధిపతియైన రాహువు డిసెంబర్ 5న తృతీయ స్థానంలోకి రావడం వలన సోదరసోదరీమణుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం లేకపోలేదు.
ALSO READ : మిథునరాశి : ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ధనప్రవాహం ఆగదు.. ఈ చిన్న పరిహారం చేయండి..!
పరిహారాలు : ఈ రాశి వారు ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.
Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
