జ్యోతిష్యం : మేషరాశి వారి కోరికలు నెరవేరే సమయం వచ్చేసింది.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి..!

జ్యోతిష్యం : మేషరాశి వారి కోరికలు నెరవేరే సమయం వచ్చేసింది.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి..!

మేష‌రాశి

మేషరాశి
ఆదాయం : 11
వ్యయం : 05
రాజపూజ్యం : 01
అవమానం : 04


అశ్వని 1,2,3,4 పాదములు
భరణి 1, 2, 3, 4 పాదములు
 కృత్తిక 1వ పాదముల యందు జన్మించిన వారు
 

"చూ, చే, చో, లా. లీ, లూ, లే, లో, ఆ" అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మేషరాశికి చెందినవారు.

2026 - 2027 సంవత్సర ఫలితాలు: మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి
వారికి తృతీయంలో గురువు, చతుర్దంలో కేతువు,లాభస్థానంలో రాహువు, వ్యయంలో శని అలాగే జూన్
2వ తేదీన గురువు తృతీయం నుండి చతుర్థంలోకి,డిసెంబర్ 5న రాహువు కేతువుల మార్పు, రాహువు
దశమ స్థానంలో, కేతువు చతుర్ధం స్థానంలో ఉంటారు.

 ఈ ప్రధాన గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగానే కలిసివస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటాయి. మీరు కష్టపడితేనే దానికి తగినట్టు విజయాలు అందుకోగలుగుతారు. 

ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలిననాటి శని కాలంలో ఫిజికల్​గా యాక్టివ్ గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తాడు. అదృష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. గృహ యోగం, వాహన యోగం ఏర్పడుతుంది.

అక్టోబర్ 30వ తేదీ తర్వాత గురువు నాల్గవ ఇంటి నుండి 5వ ఇంటిలోకి సంచరిస్తాడు.కెరియర్ పరంగా మంచి అభి వృద్ధి, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి.  మేష రాస్యాధిపతి బలంకలిగి ఉండటం వలన ఉత్సాహంగా డగలుగుతారు. 

కానీ ఇదే సమయంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల పైన కుటుంబ విషయాలు పైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోయి రక్తసంబంధీకులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. సంతానం యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

 ఈరాశి వారికి ఏలినాటి శని కొనసాగుతుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి.అవివాహితులకు వివాహ కాలంగా చెప్పవచ్చు కానీ వివాహ నిశ్చయానికి, పెళ్ళికి సమయం కొంత ఎక్కువగా వుండవచ్చు. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. 

ALSO READ : వృషభరాశి : కొత్త పెడుబడులకు అవకాశం... ఆర్థికంగా బలపడతారు

కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కొంత అభివృద్ధి సాధిస్తారు. ప్రజలలో ఆదరణ పొందుతారు. చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలతోపాటు బరువు బాధ్యతలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశాలున్నాయి.

సినీకళా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు సంతోషాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాలు ఊపందు కుంటాయి.విద్యార్థినీ విద్యార్థులు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి ఇబ్బందులు తప్పక పోవచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.తల్లిదండ్రుల సహకారంతో ఉన్నత శిఖరాలకువెళ్ళగలరు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. హెచ్ 1 బి వీసా, పి.ఆర్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

స్త్రీలకు ప్రత్యేకం: ఈ సంవత్సరం రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినా సంతానం మీ మాట వినక పోవడం వలన మీరు వారి కోసం ఎంత శ్రమించినా అది వృథా అవుతుంది. అయితే వారిని దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది.

 ఈ రాశి వారికి ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అత మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణం అవుతాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. స్వయం ఆర్థిక పురోగతి సాధిస్తారు.

మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలోని వారు పేరు ప్రఖ్యాతలు పెంచుకోగలుగుతారు. చార్టెడ్ అకౌంటెంట్స్, బ్యూటీపార్లర్ నిర్వాహకులు, వైద్యరంగంలో ఉన్నవారు, సాఫ్ట్వేర్ రంగంలోని వారు, అడ్మినిస్ట్రేషన్ రంగంలోనివారు బాగా రాణిస్తారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐఏఎస్,ఐపీఎస్. వంటి సివిల్ సర్వీస్లకు అతికష్టం మీద ఎంపిక అవుతారు.వివాహం విషయంలో జాతక పరిశీలన అలాగే కుటుంబ పరంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. క్రీడారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది.

  • ప‌రిహారాలు: ప్రతి శ‌నివారం శ‌ని భ‌గ‌వానుడికి తైలాభిషేకంచేయించండి.
  • శ‌ని త్ర‌యోద‌శి రోజున  నువ్వులు, బెల్లం దానం ఇవ్వాలి.
  • అఘోర పాశుపత హోమం చేయించడం మంచిది. 
  • వివాహాల విష‌యంలో తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకోవద్దు. 
  • స్త్రీలు ప్రతిరోజు దుర్గస్తుతి పఠించడం
  • ప్రతి మంగ‌ళ‌వారం, శ‌నివారం ఎరుపు వత్తులతో దీపారాధన చేయడం,
  •  8 మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించడం మంచిది.

Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి.  ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.