మకరరాశి :  స్థిరాస్తులు సమకూరుతాయి.. ఉన్నత ఉద్యోగం..నూతన గృహం..ఇంకా ఎన్నో శుభవార్తలు వింటారు

మకరరాశి :  స్థిరాస్తులు సమకూరుతాయి.. ఉన్నత ఉద్యోగం..నూతన గృహం..ఇంకా ఎన్నో శుభవార్తలు వింటారు

మకరరాశి 

ఆదాయం: 07
వ్యయం: 07
రాజపూజ్యం:01
అవమానం: 06

ఉత్తరాషాఢ 2,3,4 పాదములు
శ్రవణం 1,2,3,4 పాదములు
ధనిష్ఠ 1,2 పాదముల యందు పుట్టినవారు
"భో, జా, జి, జూ. జే. ఖా, గా, గి"
అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మకరరాశికి చెందినవారు.

2026 - 2027 సంవత్సర ఫలితాలు : మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని, ఆరింట గురువు. అష్టమంలో కేతువు ఉన్నారు. అలాగే జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో, అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు అష్టమంలో, డిసెంబర్ 5 నుండి రాహువు జన్మరాశిలో సప్తమంలో కేతువు ఈ గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశిఫలితాలు తెలియజేయడం జరిగింది.

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి సంబందం కుదురుతుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

రాజకీయ రంగంలో ఉన్నవారికి ఒక పదవి లభిస్తుంది. ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహాల యొక్క స్థానాలను పరిశీలించినట్లయితే ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని మూడవ ఇంటిలో అంటే మీన రాశిలో ఉండి చాలా అనుకూలంగా ఉన్నారు.

రాహువు ధన స్థానంలో అంటే కుంభరాశిలో ఉన్నాడు. కేతువు అష్టమ స్థానంలో అంటే ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. శని మూడవ ఇంటిలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారలపరంగా అద్భుతమైన ఫలితాలను మీరు అందుకోగలుగుతారు.

ALSO READ : ధనస్సురాశి : కష్టాలు తీరుతాయి.. ఊహించని ధనలాభం.. గృహయోగం కలుగుతుంది.

మీ కృషి పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి.

రాహువు ధన స్థానంలో ఉంటారు కాబట్టి ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతువు అష్టమ స్థానంలో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

స్కిన్ ఎలర్జీ, ఎసిడిటి, ఉబ్బసం, థైరాయిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ప్రయాణాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. శని మూడో ఇంట్లో ఉండటం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. శని బలంగా ఉన్నారు కాబట్టి ఏ ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

వీరికి వివాహపరంగా చూసుకున్నట్లయితే గురువు ఏడవ ఇంటిలో ఉన్నంతకాలం వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో తరచుగా తప్పుడు సూచనలు అందుతాయి. కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నించొచ్చు. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పని చేయాలి. కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

ALSO READ : వృశ్చిక రాశి: శుభ గ్రహాల సంచారం.. పట్టిందల్లా బంగారమే.. అదృష్టం తన్నుకొస్తుంది..!

సాంకేతిక విద్యాపరంగా రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. హెచ్ 1బి, గ్రీన్ కార్డ్​ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. విదేశాలలో చదువుకుని, పార్టెం ఉద్యోగం చేసే వారికి కలిసివస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది.సాఫ్ట్​ వేర్ రంగంలోని వారికి, మెకానికల్ రంగంలోని వారికి, వైద్యవృత్తిలోని వారికి, హోటల్ వ్యాపారస్తులు, మీడియా రంగంలోని వారికి మంచి అవకాశాలు కలిసివస్తాయి. కాలం అనుకూలంగా ఉంది.

డిసెంబర్ 5 నుండి జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అప్పు ఇవ్వడం కలిసిరాదు. విదేశాలలో స్థిరపడాలని అనుకునేవారికి, ఉద్యోగరీత్యా విదేశాలకు
వెళ్ళిరావాలనుకునే వారికి అనుకూలంగా ఉంది.. ప్రయత్నించండి. విదేశీయానం మీరు ఊహించిన దానికంటే ముందుగానే వెళ్ళే అవకాశం ఉంది.

ఈ రాశివారు ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో భృగుపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం, కుబేర కుంకుమతో మంగళవారం, శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయించడం చెప్పదగినది. ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించగలుగుతారు.

ALSO READ : వృషభరాశి : కొత్త పెడుబడులకు అవకాశం... ఆర్థికంగా బలపడతారు

స్త్రీలకు ప్రత్యేకం : ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. హెచ్ 1బి, గ్రీన్ కార్డ్ లభించే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి విదేశీయానం చేసే అవకాశం గోచరిస్తుంది. సంతాన పురోగతి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జీవితభాగస్వామితో కొన్ని సంందర్భాలలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.గైనిక్​ కు  సంబంధించిన, చర్మసంబంధమైన, థైరాయిడ్కు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.

వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా పురోగతి ఉంటుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు.

దైవదర్శనాలు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి, బొటిక్స్ నడిపే వారికి, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీపార్లర్స్ నడిపేవారికి, కాస్మోటిక్స్ వారికి ఈ సంవత్సరం కలిసివస్తుంది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

ఇన్సూరెన్స్​ ల  విషయంలో జాగ్రత్త వహించండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. స్వగృహం కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరమని పండితులు సూచిస్తున్నారు

ALSO READ : కర్కాటకరాశి : ఖర్చులు పెరిగినా డోంట్ వర్రీ.. గ్రహాలు బాగా అనుకూలిస్తాయి..

పరిహారాలు :

  • ఈ రాశివారు ప్రతిరోజు దుర్గాస్తోత్రం పఠించడం,
  • ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ
  • మొత్తం మీద ఈ రాశివారికి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి.


Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి.  ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.