అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రాజు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. గతంలో సిరిసిల్ల జిల్లా వేములవాడలో పనిచేసినప్పుడు అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణపై మార్చి 17న రాత్రి సీఐ గుండెటీ రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
గతంలో వేములవాడలో పని చేసేటపుడు బెల్లం వ్యాపారి దగ్గరి నుంచి ఫోన్ పే ద్వారా నెలకు 10 వేల చొప్పున వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. జగిత్యాల జిల్లాలోని సీఐ ఇంట్లో మార్చి 17న అర్ధరాత్రి ఏసీబీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో భారీ ఎత్తున బంగారు నగలు, రూ. 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సీఐకి మీడియేటర్ గా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా పని చేసినట్లు గుర్తించారు. సీఐ రాజు ఫోన్ ట్రాన్సాకన్స్ పై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
