కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని చింతకుంటలో పదేండ్లుగా నిర్మాణంలో ఉన్న 668 డబుల్ బెడ్రూం ఇండ్లను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు మంగళవారం పరిశీలించారు. ఇండ్ల సముదాయాల వద్ద రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, తాగునీరు, లిఫ్టులు, విద్యుత్ కనెక్షన్లు వంటి అన్ని మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించిన తర్వాతే లబ్ధిదారులకు కేటాయించాలన్నారు.
తాను మేయర్‌గా ఉన్నప్పుడు మౌలిక వసతులకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రూ.4 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. ప్రతి బ్లాక్‌కు తప్పనిసరిగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 30 వేల నుంచి 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
