Jasprit Bumrah: బుమ్రాకు న్యాయం చేసేలా బీసీసీఐ సరికొత్త ప్లాన్

Jasprit Bumrah: బుమ్రాకు న్యాయం చేసేలా బీసీసీఐ సరికొత్త ప్లాన్

Jasprit Bumrah: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇటీవల ప్రకటించిన కాంట్రాక్ట్ జాబితాలో A+ కేటగిరీని తొలగించింది. గతంలో ఈ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే ఉండేవారు. దీంతో వారికి ఏడాదికి రూ. 7 కోట్ల చొప్పున బోర్డు పారితోషికంగా అందజేసేది. కానీ ఆ కేటగిరీని పూర్తిగా తొలగించడంతో బుమ్రా A+ నుంచి A కేటగిరీకి చేరాడు. ఏ కేటగిరీకి సంవత్సరానికి రూ.5 కోట్లను మాత్రమే బీసీసీఐ చెల్లిస్తుంది. దీంతో బుమ్రా దాదాపు రూ.2 కోట్లను నష్టపోతున్నాడు. 

బుమ్రా అన్నిఫార్మాట్లలో ఆడుతూ కూడా రూ. 2 కోట్ల మేర మొత్తం నష్టపోతుండటంతో బీసీసీఐ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడికి మిగిలిన రూ.2 కోట్లను పరిహారంగా అందివ్వనున్నట్లు వార్త కథనాలు వస్తున్నాయి. అలాగే మరికొందరు ప్లేయర్స్ ప్రదర్శనను కూడా దృష్టిలో పెట్టుకుని వారి కాంట్రాక్టు మొత్తాలను కూడా బోర్డు పెంచే యోచనలో ఉన్నట్లు టాక్. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. 

టీమిండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తో పాటు మహ్మద్ సిరాజ్ కి చెల్లించాల్సిన మొత్తాన్ని సైతం బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరు గ్రేడ్ Cలో ఉన్నారు.  దీంతో కేవలం రూ.1 కోటి మాత్రమే అందుకోనున్నారు. గ్రేడ్-Aలో ముగ్గురు.. గ్రేడ్ -Bలో రోహిత్, కోహ్లీ గతంలో A+ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూ, కనీసం ఒక్క ఫార్మాట్లో అయినా టాప్-–10 ర్యాంకింగ్స్ లో ఉండాలనే రూల్ ఉండేది. కోహ్లి, రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లోనే ఆడుతున్నారు. దీంతో వాళ్లు B కేటగిరీలో ఉండగా.. A కేటగిరీలో శుభ్ మన్ గిల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.