కరీంనగర్: కరీంనగర్ టూ టౌన్లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఇంట్లో విషాద ఘటన జరిగింది. చంద్రశేఖర్ భార్య కరీంనగర్లోని ఇంటిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతురాలి పేరు దివ్య. వీరికి ఇద్దరు కుమారులు. గన్నేరు పప్పు దంచుకుని తాగడంతో ఆమెను కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నప్పటికీ పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
