వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భీమేశ్వరస్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేసి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బద్ది పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
