కూకట్‌పల్లిలో కోటి రూపాయల దోపిడీ కేసును పోలీసులు చేధించారు. మోటార్ సైకిలిస్ట్‌ల నుంచి కోటి దోచుకున్న గ్యాంగ్ అరెస్ట్ చేశారు. ఈ కేసులో 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు కూకట్‌పల్లి పోలీసులు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు దోపిడీ సొమ్ములో 77 లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒమర్ షరీఫ్, హౌస్ సద్దాం, హమీద్, ఖుస్రుద్దీన్ ఉన్నారు.
కూకట్ పల్లి జోన్ డీసీపీ రీతీరాజ్ చెప్పిన వివరాల ప్రకారం.. హవాలా డబ్బుపై కన్నేసిన ఖుస్రుద్దీన్ ఈ ప్లాన్ వేశాడు. కుట్రలో భాగమై మనీ కొట్టేసి అతడే డ్రామా ఆడిండు. ఖుస్రుద్దీన్ వేసిన ప్లాన్ ప్రకారం ముందుగా మిరపపొడి దాడి చేసి ఆపై దోపిడీ చేశారు. ఖుస్రుద్దీన్ క్యాష్ రిసీవ్ చేసుకుని వెళ్తున్న సమయంలో మూడు బైక్‌లపై వెంబడించి గ్యాంగ్ పథకం అమలు చేసింది. మార్చి 16న రాత్రి పిల్లర్ నెం. 836 వద్ద ఘటన జరిగింది. ఖుస్రుద్దీన్ కళ్ళలో కారం కొట్టాడు. ఆ సమయంలో బస్సును ఢీకొట్టి బాధితులు కిందపడ్డారు. కళ్లలో మిరపపొడి వేసి నగదు ఉన్న కాటన్ బాక్స్ నిందితులు దోచుకుని వెళ్ళారు. ఆ సమయంలో కూకట్ పల్లి కానిస్టేబుల్ ఆ రూట్ లో వెళ్తూ ఘటనపై ఇన్స్పెక్టర్ కు సమాచారం అందిందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
►ALSO READ | యశోద ఆస్పత్రిలో 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన కిలాడీ లేడీ అరెస్ట్
సంఘటనా స్థలంలో నిందితులు హోండా యాక్టివా వదిలేసి పరారీ అయ్యారు. వాహనం క్లూ ఆధారంగా నిందితులను ట్రేస్ చేశారు పోలీసులు. ఆ వాహనం ఓ లేడి పేరు మీద ఉంది. దాన్ని బహుదూర్ పురకు చెందిన సోహెల్ వాడుతున్నారు. సోహెల్ ఫోన్ సిగ్నల్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో చూపించింది. సోహెల్ కూడా కుట్రలో భాగమే .అతనితో పాటు మరో ఇద్దర్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నాం. నిందితులు లక్నోకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశాం. ఇంకా 5 మంది నిందితులు పరారీలో ఉన్నారు.. పోలీసులు గాలింపు కొనసాగుతుంది. సీసీటీవీ, టెక్నికల్ ఎవిడెన్స్‌తో కేసు చేధించారు.
కూకట్‌పల్లి పోలీసులు బాలానగర్ సీసీఎస్ జాయింట్ ఆపరేషన్ చేసి వేగంగా కేసు చేధించారు అని తెలిపారు.
