యశోద ఆస్పత్రిలో 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన కిలాడీ లేడీ అరెస్ట్

యశోద ఆస్పత్రిలో 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన  కిలాడీ  లేడీ అరెస్ట్

వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడీ దొంగ డాక్టర్  ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని పలు ఆసుపత్రులలో వైద్య నిపుణురాలిగా నటిస్తూ, రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరిస్తున్న  మహిళ గౌండ్ల శిరీష , ఆమెకు సహకరిస్తున్న ఆమె భర్త సాయికుమార్ గౌడ్ ను ను సికిందరాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ , మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులది వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలంగా గుర్తించారు పోలీసులు

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..  నిందితురాలు శిరీష ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు తన భర్తతో కలిసి ఆసుపత్రులలో దొంగతనాలకు ప్లాన్ చేసింది. తన వైద్య పరిజ్ఞానంతో వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. డాక్టర్ ఆప్రాన్ (Apron) ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న 'డయాజెపామ్' (Diazepam)  మత్తు ఇంజక్షన్‌ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యేది. 

►ALSO READ | చైనాలో రోబోను అరెస్ట్ చేసిన పోలీసులు : 70 ఏళ్ల మహిళ భయపడిన కేసులో..

2026 మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో, అలాగే చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్‌కు ఖర్చు చేసేవారు. వీరి నుంచి   సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, ఒక మారుతీ సుజుకీ బాలెనో కారు,  రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని పోలీసులు తెలిపారు.