మనకు రోబో.. అదేనండీ హ్యూమనాడ్ రోబో.. భావోద్వేగాలు ఉన్న రోబో ఇప్పుడు చైనాలో కామన్ అయ్యాయి. కొన్నేళ్లుగా ఇలాంటి రోబోలను వివిధ పనుల్లో.. చాలా నగరాల్లో ఉపయోగిస్తున్నారు చైనాలో. చైనాలోని మకావ్ సిటీలో జరిగిన ఓ ఘటనతో.. ఆ హ్యుమనాడ్ రోబోను అరెస్ట్ చేశారు పోలీసులు.. పబ్లిక్ ప్లేస్ లో 70 ఏళ్ల మహిళ భయపడిన వివాదంలో.. ఈ రోబోను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. రోబో అరెస్ట్ వెనక పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాధారణంగా దొంగతనాలు చేసినవారినో, గొడవలు పడేవారినో పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తుంటాం. కానీ చైనాలోని మకావులో మాత్రం ఏకంగా ఒక హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అరెస్ట్ చేసినంత పనిచేశారు. రోబోను పోలీసులు పట్టుకుని తీసుకెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. పాపం రోబో జైలు పాలైంది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ గందరగోళానికి అసలు కారణం ఆ రోబో ఒక వృద్ధురాలిని భయపెట్టడమేనని తేలింది.
🚨🇲🇴🇨🇳 BREAKING — Macau:
— ✦✦✦ 𝙿𝚊𝚖𝚙𝚑𝚕𝚎𝚝𝚜 ✦✦✦ (@PamphletsY) March 16, 2026
Police Arrested a Robot in China.
It Had Harassed an Elderly Woman. pic.twitter.com/V4adTHP02M
మకావులోని ఒక ఎడ్యుకేషన్ సెంటర్ తన ప్రమోషన్ కార్యకలాపాల కోసం యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీకి చెందిన ఒక అడ్వాన్స్‌డ్ రోబోను వీధుల్లోకి వదిలింది. పటానే ప్రాంతంలోని ఒక ఇరుకైన ఫుట్‌పాత్‌పై ఒక వృద్ధురాలు తన ఫోన్ చూసుకుంటూ వెళ్తుండగా.. ఈ రోబో ఆమె వెనుకే వచ్చి ఆగిపోయింది. ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడటంతో.. తన వెనుకే వింతగా నిలబడి ఉన్న రోబోను చూసి తీవ్రంగా భయపడిపోయింది. ఆమెకు ఎలాంటి శారీరక గాయాలు కానప్పటికీ.. షాక్‌కు గురవడంతో ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు.
ఈ లోపు అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ రోబోను మనుషులను పట్టుకున్నట్టే భుజంపై చేయి వేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ దృశ్యం చూడ్డానికి రోబోను అరెస్ట్ చేస్తున్నట్లుగా అనిపించడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. సదరు ఎడ్యుకేషన్ సెంటర్ ఈ ఘటనపై క్షమాపణలు కూడా కోరింది. ఆ రోబోను రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తున్నామని, వృద్ధురాలు ఆగిపోవడంతో రోబో కూడా వెనుక ఆగిందని వారు వివరణ ఇచ్చారు. పోలీసులు ఆ రోబోను దాని యజమానికి అప్పగిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి యంత్రాలను వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
