నానితో బలగం వేణు సినిమా.. కాంబో సెట్ చేసిన దిల్ రాజు?

నానితో బలగం వేణు సినిమా.. కాంబో సెట్ చేసిన దిల్ రాజు?

బలగం(Balagam) సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్నాడు జబర్దస్త్ వేణు(Jabardasth Venu). ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. దాంతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణు(Balagam Venu)గా మారిపోయాడు. చాలా సెన్సిటీవ్ కథని డేడికేటెడ్ గా అటెంప్ట్ చేసి ప్రశంసలు అందుకున్నాడు వేణు. ఇక బలగం సినిమా వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్నా నేపధ్యంలో వేణు తరువాతి సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 

తాజాగా ఇదే విషయంపై ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వేణు తన తరువాతి సినిమా కోసం నేచురల్ స్టార్ నానిని సెలెక్ట్ చేసుకున్నాడట. ఈ కాంబోని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సెట్ చేశారట. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథ చర్చలు పూర్తవగా.. ఫైనల్ వర్షన్ తో ఫుల్ సాటిస్ఫై అయ్యారట దిల్ రాజు. ఇక ఇదే కథను నానికి వినిపించగా వెంటనే ఒకే చేశారని టాక్. అతి త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. 

ఇక విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇక జనవరి 4న ఓటీటీకి  వచ్చిన హాయ్ నాన్న సినిమా అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. మరి హాయ్ నాన్న తరువాత నాని వేణుతో సినిమా చేస్తారా? మధ్యలో వేరే డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.