
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో అంటే.. మాస్ ఫ్యాన్స్కు పూనకాలే. సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో బాలకృష్ణ ఫ్యాన్స్కు మంచి విందునిచ్చాడు బోయపాటి. ఇక ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ2’తో ఈ కాంబో మళ్ళీ వస్తోంది. ఇప్పటికే మూవీ కాన్సెప్ట్ వీడియోతో అంచనాలు పెంచిన ఈ కాంబో.. ఇపుడు టీజర్తో వచ్చింది.
బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా అఖండ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. బాలయ్య బర్త్ డేకి ఒకరోజు ముందే నేడు (జూన్9న) టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చారు. టీజర్ పవర్ ఫుల్గా సాగింది.
ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న, మాస్ యాక్షన్ కాన్సెప్ట్తో అఖండ 2 తెరకెక్కినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తన ఉగ్రరూపంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 'థియేటర్లో తాండవం..అఖండ తాండవం' మొదలవ్వనుందనే హింట్ ఇచ్చింది ఈ టీజర్. దానికితోడు తమన్ BGM, బాలకృష్ణ మాస్ ఎలివేషన్కు ఇచ్చిన మ్యూజిక్ స్కోర్ టీజర్లో హైలెట్గా నిలిచింది. మొత్తానికి అఖండ 2 టీజర్ బాలయ్య అభిమానులకు గూసుబంప్స్ తెప్పిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అఖండ2’తో థియేటర్లో దేశం మొత్తం ఈ సారి తాండవమే!
అఖండ 2 షూటింగ్.. అద్భుతమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. అందులో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో పలు కీలక సన్నివేశాలను బోయపాటి షూట్ చేశాడు. అంతేకాకుండా, ఇటీవలే జార్జియాలో కూడా షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సన్నివేశాలు మూవీలో హైలైట్‌గా ఉంటాయనీ మేకర్స్ చెప్పుకొస్తున్నారు.
అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే, తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా వైడ్‌గా దీన్ని విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సి.రామ్‌ప్రసాద్, సంతోశ్ డిటాకే ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.