
ఫ్రెండుకు జాబొచ్చినా... గర్ల్ ఫ్రెండ్ హ్యాండిచ్చినా.. ఇంటికి సుట్టమొచ్చినా.. రాకరాక వానొచ్చినా.. మస్తు.. ఖుషీగా ఓపెన్ చేసేది బీర్ బాటిలే. అవును.. బాధైనా, సంతోషమైనా, వేడుకైనా, వేదనైనా బీర్లో షేర్ చేసుకోవడం మనోళ్లకు బాగా అలవాటైపోయింది. అయితే.. బీర్ తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నాయి కొన్ని స్టడీలు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం"'థియేటర్లో సినిమా స్టార్థవడానికి ముందు ఈ యాడ్, ముఖేష్ యాడ్ ఉండాల్సిందే. కానీ... మనోళ్లు అవన్నీ పట్టించుకుంటారా? ఇంటర్వెల్ కాంగనే... బయటికి పోయి ఓ దమ్ము గుంజి వస్తారు. సినిమా అయిపోయి ఇంటికి పోంగనే చల్లటి బీరు ఏసి ఇంత తిని పండుకుంటారు. బావొచ్చినా, బంధువొచ్చినా ఆఖరికి బాధొచ్చిన బీర్లో వెల్కమ్ చెప్తారు. చాలామంది. ఇంటికొచ్చిన చుట్టానికి బీర్ తో మర్యాద చేయకపోతే అదొక నామోషీ మరి. అయితే.. బీర్ ప్రేమికులందరికీ ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ఓ చేదు వార్త మోసుకొచ్చింది. అదేంటిదంటే... 'బీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. ఈ ముచ్చట ఓరెగాన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలిందట. ఇంత మంచి వార్త చెప్పి మరి చేదు వార్త అన్నారేంది అని అనుకుంటున్నరా? నీరు చేదుగానే ఉంటదిగా.. అందుకే అట్ల చెప్పినం.
ALSO READ : పీఎన్‌బీ స్కామ్: అమెరికాలో నేహాల్ మోడీ అరెస్ట్.. ఇండియాకి అప్పగించే ఛాన్స్ ?
- బీర్ తాగితే.. పొట్ట పెరుగుతుందని చాలామంది అనుకుంటరు. అందుకే.. చాలాసార్లు బీర్ తాగాలని ఉన్నా.. పొట్ట వస్తుందేమో అని భయపడి ఇండో మార్గం చూసుకుంటారు. అయితే.. ఈ స్టడీలో 'బీర్ తాగితే పొట్ట వస్తుంది' అనే ముచ్చట ఉత్తదే అని తేలింది. వీళ్లే కాదు.. లండన్ యూనివర్సిటీ వాళ్లు చేసిన అధ్యయనంలో కూడా బీర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుందనేది. అబద్దం అని తేలింది. కొవ్వు పెరగడం, పొట్ట రావడం సంగతి అటుంచితే... ఇందులోని ఫ్లేవనాయిడ్లు బదువు తగ్గించడానికి తోడ్పడుతాయట.
- గట్టిగా రెండు బీర్లు తాగితే.. కళ్లు తిరుగుతాయి. 'భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది" అని స్కూల్లో చదువుకున్న సోషల్ లెసన్ కళ్లముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ ముచ్చట పక్కకు పెడితే.. వీరు తాగడం వల్ల వయసు మీద పడిన తర్వాత వచ్చే దృష్టిలోపం సమస్య రాదట. కెనడా లో చేసిన స్టడీలో ఈ విషయం బయటపడింది. ప్రతిరోజూ ఓ గ్లాస్ బీర్ తాగితే... కంటిచూపు మెరుగవుతుందట. శరీరంలో యాంటీ అక్సిడెంట్లు యాక్టివ్ గా పనిచేస్తాయట.
- 'అరేయ్.. వాణ్ణి ఏం అనకు రా... ఏదో తాగున్నడు. తాగిన మైకంలో కోపమొచ్చి అలా మాట్లాడుతున్నడు" అని ఎప్పుడైనా తాగిన తర్వాత గొడవలు జరిగినప్పుడు ఇలా సద్ది చెప్తుంటారు. మామూలుగా అయితే ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కోపం వేస్తుంది. అయితే.. బీర్ తాగినప్పుడు ఒత్తిడంతా పోతుందట. ఆ సమయంలో బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులోకి వస్తుందట. ఇది ఎవరో చెప్పిన ముచ్చట కాదు.. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు హైబీపీతో బాధపడుతున్న కొంత మందికి బీర్ తాగించి మరీ చేసిన అధ్యయనంలో తేలింది.
- బీరులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ముందే చెప్పుకొన్నాం కదా! అయితే... ఆ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయట. శరీరంలో క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఎంజైములతో బీర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫైట్ చేసి వాటిని నాశనం చేస్తాయట. ఒరెగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ విషయం తేలింది.
- మనిషి పదికాలాల పాటు చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే గుండె బాగుండాలి. దాని పని తీరులో ఏమాత్రం తేడా వచ్చినా.. అంతే సంగతులు. బ్రిటీష్మెడికల్ జర్నల్ పబ్లిష్ చేసిన ఓ ఆర్టికల్ లో బీర్ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 24.7 శాతం తగ్గుతుందని తేల్చారు. ఇందుకు కారణం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేయడమేనట.
- • శరీరానికి ఎంత ఫైబర్ అందితే.. బాడీ అంత దృఢంగా అవుతుంది. జీవక్రియలు అంతే సక్రమంగా జరుగుతాయి. ఈ విషయం ఏ డాక్టరును అడిగినా చెప్తారు. అందుకే.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకొమ్మని సలహా ఇస్తుంటారు. అయితే... బీర్ లో ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. శరీరానికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ బీర్లో 20శాతం ఉంటుందంటే నమ్మాల్సిందే..
- కిడ్నీలో రాళ్లతో బాధపడేవారికి డాక్టర్లు వీలైనంత ఎక్కువ నీళ్లు తాగమని చెప్తారు. దొరికితే కలుషితం కాని స్వచ్ఛమైన కల్లు తాగమని చెప్తారు. కల్లు దొరికితే ఓకే. కానీ... పట్నంలో ఉండేవారికి కల్లెక్కడ దొరుకుతుంది?
- అందుకే చాలామంది రాళ్లతో బాధపడే వారికి అప్పుడప్పుడు ఓ బీర్ వేయమని సలహా ఇస్తారు. ఎందుకంటే బీర్ లో రాళ్లు కరిగించే గుణాలున్నాయి. పొటాషియం, మెగ్నీషియం బీరులో పుష్కలంగా ఉండి, కిడ్నీలో రాళ్లు కరిగించడానికి సహాయపడతాయి.
- ఆ 'ఆరోగ్యంగా ఉండండి.. రన్ అవుట్ కాకండి" అంటూ సిగరెట్ యాద్లో రాహుల్ ద్రావిడ్ చెప్పే మాటలు గుర్తున్నాయా? బీ విటమిన్ తక్కువై ఆరోగ్యం విషయంలో కూడా రన్ అవుట్ కావొద్దంటే రోజుకో గ్లాసు బీర్ తాగమని చెప్తున్నారు పరిశోధకులు. బీర్ లో బి-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కణాల ఆరోగ్యాన్ని బి. విటమిన్లు పెంచుతాయి.
- ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా బీర్ చాలా ఉపయోగపడుతుంది. వెంట్రుకల ఆరోగ్యం కోసం, పటుత్వం కోసం రకరకాల షాంపూలు, నూనెలు, ప్యాక్ లు, వాడి అలసిపోయారా? అయితే.. ఈ సారి బీర్ తో మీ జుట్టు కడిగిచూడండి. తేడా మీరే గమనిస్తారు. ఆల్రెడీ మార్కెట్లో బీర్ షాంపూలు దొరుకుతున్నాయి కదా!
V6 Velugu