ఛీ.. మరీ ఇంత దారుణమా.. అమర్ దీప్ భార్య ఫోటోలు మార్ఫింగ్

ఛీ.. మరీ ఇంత దారుణమా.. అమర్ దీప్ భార్య ఫోటోలు మార్ఫింగ్

బిగ్ బాస్ చూసే ఆడియన్స్ పిచ్చి రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ మాట నార్మల్ గా షో చూసి ఎంజాయ్ చేసేవారి గురించి కాదు.. అభిమానం పేరుతో కొంతమంది చేసే రచ్చ గురించి. గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్స్ కూడా చాలామందికి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. వారి వారి ఫెవరేట్ కంటెస్టెంట్స్ కు సపోర్ట్ చేసుకున్నారు కానీ.. ఈ సీజన్ మాత్రం ఫ్యాన్స్ దిగజారిపోతున్నారు. ఎంతలా అంటే హౌస్ లో కంటెస్టెంట్స్ ఆడే ఆటకి.. బయట వాళ్ళ కుటుంబాలను తిట్టేంతలా. అది కూడా తల్లి, భార్యలను అందులోకి లాగుతూ చాలా నీచంగా బిహేవ్ చేస్తున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అమర్ ఫ్రెండ్ నరేష్ లొల్ల ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. ఇందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్ దీప్ గురించి, తన ఫ్యామిలీఫై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి వివరించాడు.. నా ఫ్రెండ్ అమర్ దీప్ భార్య తేజూ చాలా బాధను అనుభవిస్తోంది. ఎవరితో షేర్ చేసుకోలేని పరిస్థితి తనది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి తనకు ట్యాగ్ హరాజ్ చేస్తున్నారు కొంతమంది. ఆ విషయాన్ని ఎవరితోనైనా ఎలా చెప్పుకుంటుంది. తనలో తానే నరకాన్ని అనుభవిస్తోంది. ఇన్ని సీజన్స్ లో ఏ ఫ్యామిలీకి కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. నేనే సైబర్ క్రైమ్ కి వాళ్లకి చెప్పి ఫొటోలు, అకౌంట్స్ తొలగించేలా చేశాను.

మరికొందరేమో తేజూ అమర్ కు సపోర్ట్ చేయడం లేదని కామెంట్లు చేస్తున్నారు. మీకేం తెలుసు ఆమె సపోర్ట్ చేస్తుంది లేనిది. హౌస్ లో అమర్ పడుకునేంతవరకు తను పడుకోదు. అమర్ కు ఎప్పుడెప్పుడు ఏం కావాలి? ఏ డ్రస్సులు పంపాలి? మెడిసిన్స్ ? అనే ప్రతి విషయాన్ని తానే దగ్గరుండి చూసుకుంటుంది. ఇవన్నీ తెలియకుండా.. అమర్ కు తేజూ సపోర్ట్ చేయట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.. అంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు నరేష్ లొల్ల. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Also Read:- డబ్బు కోసం అలా చేయాలంటే భయమేస్తోంది: ఆలియా భట్