మా నాన్న కూడా ఊరోడే.. గర్వంగా చెప్తున్నా.. ఎమోషనల్ అయిన నాగ్, కంటెస్టెంట్స్

మా నాన్న కూడా ఊరోడే.. గర్వంగా చెప్తున్నా.. ఎమోషనల్ అయిన నాగ్, కంటెస్టెంట్స్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) లో ఏడవ వారం కూడా ముగింపుదశకు చేరుకుంది. ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ వారం ఎవరు ఇంటినుండి ఎలిమినేట్ కానున్నారని. ఇక రతికా(Rathika rose) రీ ఎంట్రీ కూడా ఉండటంతో ఈ వారం ఆటపై ప్రేక్షకులు కాస్త ఆసక్తిని కనబరిచారు. ఇందులో భాగంగానే శనివారం ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఇక తాజాగా శనివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమో మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంది. నామినేషన్ కోసం ఉపయోగించిన కుండల టాస్క్ తో స్టేజిపైకి వచ్చారు నాగార్జున. ఒక్కొక్కరి కుండను పగలగొడుతూ అదిరిపోయే ప్రశ్నలను సంధించాడు నాగార్జున. అందులో ముందుగా అశ్విని గురించి మాట్లాడిన నాగార్జున ఆమెను ఎందుకు చేశావమ్మా అలా అని అడిగాడు.. దానికి ఆమె ఎం చేశాను సార్ అని అడిగింది. ఎం చేశావో నీకు తెలియదా అన్నారు నాగ్.. ఒక్కోసారి నువ్ మాట్లాడే పద్ధతి బాగుండటంలేదు అన్నారు. తరువాత భోలే గురించి చెప్తూ.. ఊతపదాలు వాడటం కరక్టే కానీ.. ఎర్రగడ్డ అనడం ఊతపదం కాదు అన్నారు. 

Also Read :- భగవంత్ కేసరి కోసం శ్రీలీల షాకింగ్ రెమ్యునరేషన్

ఆతరువాత ప్రియాంక గురించి చెప్తూ.. మాట జారిన తరువాత క్షమాపణ అడిగినా కూడా అది వర్కౌట్ అవదు అన్నారు. శోభా, తేజ కోసం వచ్చిన కేక్ విషయంలో అమర్ దీప్ ను తప్పుబట్టారు. దాని వాళ్ళ పెద్ద సమస్యలో ఇరుక్కున్నావ్ అని చెప్పాడు నాగ్. ఆతరువాత సందీప్, పల్లవి ప్రశాంత్ గొడవ గురించి మాట్లాడిన నాగ్.. ప్రశాంత్ సందీప్ నిన్ను ఊరోడు అన్నాడు అన్నావ్. అలా అనడం తప్పా. ఒకరిపై నిందలు వేసేటప్పుడు వెనుకాముందు చూసుకోవాలి అని వార్ణింగ్ ఇచ్చాడు నాగ్. అంతటితో ఆగకుండా.. ఊరోడు అనడం తప్పు కాదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఊరోళ్ళే. అందరికీ అన్నం పెడుతుంది కూడా ఊరోళ్ళే. నేను కూడా గర్వాంగా చెప్పుకుంటాను మా నాన్న కూడా  ఊరోడే.. అంటూ ఎమోషనల్ గా అన్నారు నాగ్. దీంతో కంటెస్టెంట్స్ అన్నారు చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారడమే కాకుండా.. శనివారం ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఎం జరగనుంది అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.