భగవంత్ కేసరి కోసం శ్రీలీల షాకింగ్ రెమ్యునరేషన్.. కాజల్ కన్నా ఎక్కువ

భగవంత్ కేసరి కోసం శ్రీలీల షాకింగ్ రెమ్యునరేషన్.. కాజల్ కన్నా ఎక్కువ

టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీలీల(Sreeleela) హవా నడుస్తోంది. హీరో ఎవరైనా? డైరెక్టర్ ఎవరైనా? హీరోయిన్ మాత్రం శ్రీలీల ఉండాల్సిందే అనేట్టుగా మారిపోయింది సిచువేషన్. ఓపక్క స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే.. మరోపక్క యంగ్ హీరోలను కూడా వదలడంలేదు ఈ బ్యూటీ. తన అద్భుతమైన నటన, డాన్స్ తో ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తోంది శ్రీలీల. అయితే ఈ అమ్మడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  

ఇక ఈ బ్యూటీ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ భగవంత్‌ కేసరి. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ మూవీ. 

Also Read :- ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ కాంబో రిపీట్

ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర అంటే శ్రీలీలదే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన అద్భుతమైన నటనతో సినిమాలో ఎమోషన్ ను చాలా బాగా క్యారీ చేసింది శ్రీలీల.  ఇక సినిమా చివర్లో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్ లో కూడా ఇరగదీసింది శ్రీలీల. ఇక ఈ సినిమా కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషనే తీసుకుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన స్టార్ బ్యూటీ కాజల్‌ కంటే ఎక్కువ పారితోషికం వసూలు చేసిందట ఈ లేటెస్ట్ బ్యూటీ. ఈ సినిమా కోసం కాజల్‌ రూ.1.5 కోట్లు తీసుకోగా.. శ్రీలీల మాత్రం రూ.1.8 కోట్లు పారితోషికంగా తీసుకుందని సమాచారం. మొదటి సినిమాకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీలీల.. ఇప్పుడు కోటిన్నరకు పైగా తీసుకుంటోంది.