బుల్లితెర హిస్టరీలోనే బిగ్గెస్ట్ రియాలిటీ సెన్సేషన్ 'బిగ్‌బాస్ తెలుగు' మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటివరకు తొమ్మిది సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని, రేటింగుల రికార్డులను తిరగరాసిన ఈ షో.. ఇప్పుడు మరింత గ్రాండ్‌గా, పవర్‌ఫుల్‌గా పదో సీజన్ (Bigg Boss Telugu 10) కు రెడీ అయిపోయింది. హోస్ట్‌గా తనదైన స్టైల్‌తో మెప్పించే కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌ను నడిపించడానికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అగ్నిపరీక్ష సీజన్-2.. సామాన్యులకు ఎంట్రీ..
అయితే, ఈ మైల్‌స్టోన్ సీజన్-10లో బిగ్‌బాస్ మేకర్స్ సామాన్యులకు (Commoners) మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించారు. గతేడాది లాగే ఈసారి కూడా 'అగ్నిపరీక్ష సీజన్-2' కాన్సెప్ట్‌తో కామన్ మ్యాన్‌కు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నారు. లాంటి సెలబ్రిటీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కేవలం మీలోని టాలెంట్, యూనిక్ పర్సనాలిటీతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యే అద్భుతమైన అవకాశం ఇది. ఈ బిగ్‌బాస్ హౌస్‌లోకిఎంట్రీపై లేటెస్ట్ గా మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
హౌస్‌లోకి ఎంట్రీ రూట్ మ్యాప్ ఇదే!
మీలో టాలెంట్ ఉందా? బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీలతో సై అంటే సై అనే దమ్ముందా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ మొబైల్ తీసి ఓ క్రేజీ వీడియో రికార్డ్ చేయండి. జూన్ 12 నుండి జూన్ 20 వరకు మాత్రమే ఆడిషన్స్ కి టైమ్ ఉందని నాగార్జున తెలిపారు.. మీ టాలెంట్, మీ ప్రత్యేకతను వివరిస్తూ గరిష్టంగా 3 నిమిషాల నిడివి గల ఆడిషన్ వీడియోను రూపొందించాలని చెప్పారు. మీ వీడియోను అధికారిక వెబ్‌సైట్ https://bbtelugu.jiostar.com లో లాగిన్ అయి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు.
ALSO READ : ఫిఫా వరల్డ్ కప్ 2026లో నోరా ఫతేహి 'రెడ్ హాట్' పర్ఫార్మెన్స్..
సీజన్-10పై పెరిగిన అంచనాలు..
పదో సీజన్ కావడంతో ఈసారి హౌస్ డిజైన్, టాస్కులు, గ్లామర్ డోస్ మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడే సెలబ్రిటీలు , గ్లామర్ డోస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని సమచారం. సెలబ్రిటీల ఇగోలకు, సామాన్యుల పంతాలు తోడైతే హౌస్‌లో 'అగ్నిపరీక్ష' మరింత రసవత్తరంగా మారడం ఖాయం. సో.. బుల్లితెరపై స్టార్‌గా మారాలనే మీ కలని నిజం చేసుకునే టైమ్ వచ్చేసింది. వెంటనే అప్లై చేసేయండి, బిగ్‌బాస్ హౌస్ గేట్లు మీకోసం తెరుచుకోవచ్చు మరి..
