Bigg Boss Telugu 10: లీకైన 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10' సెలబ్రిటీల లిస్ట్..? సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష 2'!

Bigg Boss Telugu 10: లీకైన 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10' సెలబ్రిటీల లిస్ట్..? సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష 2'!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలటీ షో 'బిగ్ బాస్' తెలుగు  (Bigg Boss Telugu) మళ్లీ రెడీ అవుతోంది. విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన 10వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్‌కు సంబంధించిన అధికారిక ప్రోమోను మేకర్స్ విడుదల చేయడంతో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఈసారి ఆట నెక్స్ట్ లెవెల్..

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఈ సీజన్‌ను 'దశావతారం' (Dashavataram) అంటూ పరిచయం చేశారు. అంటే పదో సీజన్ కాబట్టి.. ఊహించని పది రేట్ల ట్విస్టులు, సరికొత్త రూల్స్, మునుపెన్నడూ చూడని మైండ్ గేమ్స్ ఉండబోతున్నాయని హింట్ ఇచ్చేశారు. ఈ షోను బుల్లితెరపై విజువల్ ఫీస్ట్‌లా మార్చేందుకు నిర్వాహకులు బిగ్ ప్లాన్ వేశారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో 'బిగ్ బాస్' హౌస్ సెట్ ను కూడా రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2'.. 

గత సీజన్ 9 లాగే ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు కామన్ పీపుల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందుకోసం 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' పేరుతో ప్రత్యేక ఆడిషన్ షోను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ ప్రాసెస్ ద్వారా మొత్తం ఐదుగురు సామాన్యులను హౌస్‌లోకి పంపించనున్నారని సమాచారం. ఈ ఆడిషన్స్ షోకు జడ్జీలుగా వ్యవహరించేందుకు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ లేదా అభిజిత్‌లతో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తుంది.

హౌస్‌లోకి వెళ్లేది వీరేనా?

వివాదాలు, పాపులారిటీ ఉన్న క్రేజీ కాంబినేషన్లను హౌస్‌లోకి దించేందుకు మేకర్స్ గట్టిగా ప్లాన్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ చక్కర్లు కొడుతుంది. వారిలో బుల్లితెర తారలైన  పల్లవి గౌడ, తేజస్విని గౌడ, శివ్ కుమార్ ఉన్నట్లు టాక్. ఇక జబర్దస్త్ గ్యాంగ్ నుంచి ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్ పేర్లు  వినిపిస్తున్నాయి.. యూట్యూబ్ , సోషల్ మీడియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్న  నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక డ్యాన్సర్ పండు మాస్టర్, ఆట సందీప్ భార్య జ్యోతి, రైటర్ కడలి సత్యనారాయణ, బుల్లి తెర నటుడు ప్రభాకర్ పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

►ALSO READ | Nara Brahmani: 66వ వసంతంలోకి బాలయ్య.. నెట్టింట వైరల్ అవుతున్న నారా బ్రహ్మణి 'NBK CDP'!

గ్రాండ్ లాంచ్ ఎప్పుడు?

పదో సీజన్ కావడం వల్ల ఈసారి కాస్త ముందుగానే హంగామా మొదలుకానుంది. ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ వినోదాల జాతర అత్యంత గ్రాండ్‌గా ప్రారంభం కానుందని సమాచారం.   ఈ రియాలిటీ షో స్టార్ మా (Star Maa) ఛానల్‌లో ప్రసారం అవుతుంది.  అటు జియోహాట్‌స్టార్ (JioHotstar) ప్లాట్‌ఫామ్‌లో 24/7 లైవ్ స్ట్రీమింగ్ కానుంది.