Nara Brahmani: 66వ వసంతంలోకి బాలయ్య.. నెట్టింట వైరల్ అవుతున్న నారా బ్రహ్మణి 'NBK CDP'!

Nara Brahmani: 66వ వసంతంలోకి బాలయ్య..  నెట్టింట వైరల్ అవుతున్న నారా బ్రహ్మణి 'NBK CDP'!

నటసింహం నందమూరి బాలకృష్ణ జూన్ 10న 66వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. బాలయ్య పుట్టినరోజు వేడుకలకు అభిమానులు సర్వం సిద్ధం చేశారు. అంతే కాదు ఈ పుట్టినరోజున అభిమానులకు థియేటర్లలో పూనకాలు తెప్పించేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సారి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.

నారా బ్రహ్మణి స్పెషల్ గిఫ్ట్.. 

తండ్రి బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేకమైన కామన్ డిస్‌ప్లే పిక్చర్ (CDP)ని విడుదల చేశారు. బాలయ్య సినీ కెరీర్‌లోని ఐకానిక్ పాత్రల విగ్రహాలను ఒక చదరంగం బోర్డుపై ఉంచి, బ్యాక్‌డ్రాప్‌లో NBK అని డిజైన్ చేసిన ఈ పిక్చర్ ఊరమాస్ లెవెల్లో ఉంది. నాన్న బర్త్ డే సందర్భంగా ఈ సీడీపీని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని బ్రహ్మణి పేర్కొనంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది..

 

 'త్రిబుల్ ధమాకా' రీ-రిలీజ్!

ఈ పుట్టినరోజున అభిమానులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి మేకర్స్ రెడీ అయ్యారు.  ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. జానపద చిత్రం 'భైరవద్వీపం' , ఫ్యాక్షన్ ట్రెండ్ సెట్టర్ 'సమరసింహారెడ్డి', ఇండస్ట్రీ హిట్ మూవీ 'నరసింహనాయుడు' థియేటర్లలోకి వచ్చేస్తున్నారు . ఈ మూడు చిత్రాలు సరికొత్త డిజిటల్ ప్రింట్‌తో జూన్ 10న థియేటర్లలోకి వస్తుండటంతో థియేటర్ల వద్ద జాతర ఖాయంగా కనిపిస్తోంది.

►ALSO READ | Heroine Bhairavi: ‘కొత్త మలుపు’తో టాలీవుడ్‌కి అస్సామీ బ్యూటీ.. క్యూట్‌నెస్‌తో కట్టిపడేస్తున్న భైరవి

కొరటాల, మలినేని కాంబోస్..
ఓ వైపు రాజకీయాలు, మరోవైపు వరుస సినిమాల్లో బాలయ్య స్పీడు పెంచారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ప్రీ-లుక్ పోస్టర్ ఇప్పటికే ఇనుప గొలుసులతో ఊరమాస్ వైబ్స్ ఇచ్చింది. జూన్ 10న దీని పూర్తి లుక్ రానుంది. ఇందులో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా డ్యూయల్ షేడ్స్‌లో అలరించబోతున్నారట. అలాగే, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో, దానికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ వివరాలు కూడా రేపే రివీల్ కానున్నాయి.

మోక్షజ్ఞ ఎంట్రీపై సర్ప్రైజ్ ఉంటుందా?

ఇవన్నీ ఒకెత్తయితే, నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ 66వ బర్త్ డే వేడుకల్లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన ఏదైనా క్రేజీ అప్‌డేట్ లేదా సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఉంటుందేమోనని ట్రేడ్ వర్గాలతో పాటు నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఈసారి బాలయ్య బర్త్ డే ట్రీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే అంటూ అభిమానులు సిద్ధం అయ్యారు.