తెలుగు తెరకు మరో సరికొత్త బ్యూటీ పరిచయమవుతోంది. ‘కొత్త మలుపు’ సినిమా టీజర్, ట్రైలర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అస్సామీ భామ భైరవి ఆర్థ్యా.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్క్రీన్‌పై ఆమె చూపించిన క్యూట్ లుక్స్, సహజమైన హావభావాలు, కాన్ఫిడెన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొదటి సినిమాతోనే నటిగా తనలో మంచి పొటెన్షియల్ ఉందనే పాజిటివ్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేయగలిగింది.
సోషల్ మీడియాలో భైరవి క్రేజ్ ఇప్పుడే ఓ రేంజ్‌లో మొదలైంది. ఆమె ఫేస్ కట్, స్మైల్ చూసిన నెటిజన్లు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నతో పోలుస్తున్నారు. అందంతో పాటు అభినయానికి స్కోప్ ఉన్న పాత్రలో భైరవి మెరిసిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ‘బ్యూటీ విత్ పెర్ఫార్మెన్స్’ కాంబినేషన్‌గా ఇప్పటికే ఈమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.
గతంలో కాయదు లోహర్ వంటి పరభాషా నటీమణులు తెలుగు ఆడియన్స్ ఓపెన్‌గా ఓన్ చేసుకున్నట్లే.. ఇప్పుడు ఈ అస్సాం కుట్టిని కూడా తమ ‘కొత్త క్రష్’గా డిక్లేర్ చేస్తున్నారు యువత. ప్రమోషనల్ ఈవెంట్లలో ఈ భామ ముద్దుముద్దుగా తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించడం అందరినీ ఆకట్టుకుంది. కొత్త భాషను నేర్చుకుని ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలనే ఆమె డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
►ALSO READ | Annapurna College: AI ఎంత ఎదిగినా.. సినిమాకు ప్రాణం భావోద్వేగాలే
సినిమా విడుదల తర్వాత కూడా భైరవి తన నటనతో మెప్పిస్తే, టాలీవుడ్‌కు మరో ప్రామిసింగ్ హీరోయిన్ దొరికినట్లే. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘కొత్త మలుపు’ చిత్రం జూన్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రస్తుతానికైతే భైరవి క్యూట్‌నెస్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇకపోతే, సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా నటించిన రెండో చిత్రమే ఈ ‘కొత్త మలుపు’.
