బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ప్రస్తుతం కెరీర్ పీక్స్‌లో ఉన్నాడు. 'యానిమల్' సినిమాలో సైలెంట్ విలనిజంతో థియేటర్లలో పూనకాలు తెప్పించారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ విలక్షణ నటుడు. అయితే, లేటెస్ట్ గా ఈ మోస్ట్ వాంటెడ్ విలన్ చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
అలియా భట్ తో విభేదాలు?
యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha)లో అలియా భట్, శర్వరీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ ఒక పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నారు. అయితే, షూటింగ్ సెట్స్‌లో అలియా భట్‌కు, బాబీ డియోల్‌కు మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయని, ఇద్దరి మధ్య పెద్ద గొడవైందంటూ నెట్టింట కొన్ని కథనాలు తెగ వైరల్ అయ్యాయి.
జనాలకు ఖాళీ ఎక్కువైంది బాస్.
ఈ రూమర్లపై బాబీ డియోల్ తనదైన శైలిలో ఘాటుగా.. కాస్త సెటైరికల్‌గా స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... నా స్నేహితుడు ఒకరు ఈ స్క్రీన్‌షాట్ పంపినప్పుడు నేనే షాక్ అయ్యాను. జనాలకు మరీ ఇంత ఖాళీ సమయం ఉందా? కూర్చొని ఇలాంటి క్రేజీ కథలు ఎలా అల్లేస్తారో అర్థం కావడం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లు చూస్తే నవ్వాలో, ఏడ్వాలో తెలియదు అంటూ నవ్వేశాడు.
అలియాపై ప్రశంసల జల్లు
అలియా అద్భుతమైన నటి, చాలా హార్డ్ వర్కర్ అని ఆమెతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి బాబీ చెప్పారు. ముఖ్యంగా 'ఆల్ఫా'లోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆమె పడ్డ కష్టం.. చేసిన ప్రిపరేషన్ చూసి నేను ఫిదా అయ్యాను. భారతదేశంలో ఇద్దరు మహిళా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లతో ఇంత భారీ యాక్షన్ సినిమా రావడం నిజంగా గ్రేట్ విజువల్ ఫీస్ట్ అని బాబీ కొనియాడాడు.
ALSO READ : బీజేపీలోకి సీఎం విజయ్ భార్య సంగీత.. ?
క్రేజీ కనెక్షన్
ఇటీవలే 'యానిమల్'లో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించాను. ఇప్పుడు ఆయన భార్య అలియా భట్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. వీరిద్దరూ నాకు మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. ఇలాంటి క్రేజీ ఛాన్సులు రావడం నా అదృష్టం అని బాబీ డియోల్ సంతోషం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి రూమర్‌ను నమ్మవద్దని, ప్రతిదానికీ తాను సమాధానం చెప్పుకుంటూ పోలేనంటూ అలియాతో విభేదాలపై బాబీ క్లారిటీ ఇచ్చారు.. ఏదేమైనా 'ఆల్ఫా' మూవీతో బాబీ డియోల్ మరోసారి థియేటర్లలో రచ్చ లేపడం ఖాయంగా కనిపిస్తోంది అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
